Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు తింటున్నది నకిలీ కోడిగుడ్డు ఏమో? గుర్తించే చిట్కాలివే

సిహెచ్
శుక్రవారం, 1 మార్చి 2024 (21:34 IST)
ఇపుడు మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్‌తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము.
 
నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది.
నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి.
కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
గుడ్డును పగలగొట్టిన వెంటనే గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన కలిసిపోతే అది నకిలీ కోడిగుడ్డు.
నిజమైన గుడ్లు నీసు వాసనను కలిగి ఉంటాయి, అయితే నకిలీ గుడ్లు వాసన లేనివిగా వుంటాయి.
పాన్‌లో పగులగొట్టి వేసిన కోడిగుడ్డు పచ్చసొన మీరు తాకకుండా వ్యాపిస్తే అది నకిలీ గుడ్డు.
కోడిగుడ్డు నకిలీదైతే దాని పెంకుకి మంట పెడితే అది కాలుతూ ప్లాస్టిక్ వాసన వస్తుంది, నిజమైనది త్వరగా కాలదు.
నకిలీ కోడిగుడ్ల వల్ల మెదడు, నరాల నష్టం, కాలేయ వ్యాధులు, రక్త ఉత్పత్తిని ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments