Webdunia - Bharat's app for daily news and videos

Install App

దవడలకు మంచి వ్యాయామం కల్పించే కీరదోస.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో...

కీరదోసలో ఆరోగ్యప్రయోజనాలు చాలా ఉన్నాయి. త‌క్కువ మొత్తంలో క్యాల‌రీల‌ను క‌లిగి ఉండే వాటిలో కీర‌దోసను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్ ఏ, సి, మెగ్నిష‌యం వంటి పోష‌కాలు సమృద్ధిగా ఉంటాయి. క

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (13:31 IST)
కీరదోసలో ఆరోగ్యప్రయోజనాలు చాలా ఉన్నాయి. త‌క్కువ మొత్తంలో క్యాల‌రీల‌ను క‌లిగి ఉండే వాటిలో కీర‌దోసను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్ ఏ, సి, మెగ్నిష‌యం వంటి పోష‌కాలు సమృద్ధిగా ఉంటాయి. కీరదోసను రోజు వారీ డైట్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు కూడా క‌రిగిపోతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా కీరదోస వల్ల కలిగే ప్రయోజానాలేంటో చూద్దాం...
 
శరీరంలోని వేడిని కీరదోసకాయ తగ్గిస్తుంది. ఛాతిలో మంటను కూడా నివారిస్తుంది. దేహంలోని విష పదార్థాలను బయటకు పంపివేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజు కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీరదోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంట్లో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరానికి నీటిని అందిస్తుంది.
 
తక్కువ క్యాలరీలు ఉండటం చేత కీరదోసకాయ బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కీరదోసకాయలను నమిలితే దవడలకు మంచి వ్యాయామం జరుగుతుంది. మలబద్దకం కూడా తగ్గిపోతుంది. చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్య సాధనంగానూ అనేకచోట్ల వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.
 
అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు కీరదోస రాకుండా చూస్తుంది. చిగుళ్ల సమస్యలు, నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను కీరదోస నిర్మూలిస్తుంది. 

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

తర్వాతి కథనం
Show comments