Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే ఏం జరుగుతుంది?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (10:37 IST)
ఉసిరికాయను దైవ వృక్షం అంటారు. ఉసిరికాయల్లో రెండు రకాలున్నాయి.  ఉసిరి కాయను తిని నీటిని తాగితే ఆ టేస్టే వేరని సంగతి అందరికీ తెలిసిందే. అందుకే నీటి బావుల్లో ఉసిరికాయ చెట్ల వేళ్లను వేస్తారు. ఆయుర్వేదానికి ఎంతగానో ఉపయోగపడే ఉసిరికాయను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే.. కొత్త ఉత్సాహాన్ని పొందినట్లవుతుంది. ఇంకా ఉసిరికాయ నిత్యయవ్వనులుగా ఉండే టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంటువ్యాధులు దూరమవుతాయి. 
 
గుండె, కిడ్నీలకు బలాన్నిస్తాయి. ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కంటి లోపాలుండవు. కండరాలు బలపడతాయి. ఉసిరి రసంతో పాటు కాకర కాయ రసం చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ నేరేడు పొడి, ఒక స్పూన్ కాకర కాయ పొడి చేర్చి తీసుకుంటే మధుమేహ వ్యాధిని నయం చేసుకోవచ్చు. 
 
ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు వుండవు. అలాగే ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని టెంకాయ నూనెలో బాగా మరిగించి, తర్వాత ఆరనించి.. మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి. అనారోగ్యాలను ఉసిరికాయ తీసుకోవడం ద్వారా ముందుగానే నియంత్రించుకోవచ్చు. ఇకపోతే.. ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments