Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఉసిరికాయ.. రోజూ ఓ ఉసిరికాయ తింటే..?

ఉసిరి కాయ పెద్దదైనా, చిన్నదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగ

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (10:28 IST)
ఉసిరి కాయ పెద్దదైనా, చిన్నదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. కాబట్టి రోజూ ఒక ఉసిరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతామని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
* ఉసిరికాయ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఆరోగ్యకరమైన శ్వాసక్రియకు ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.
* ఉసిరిరసంలో నారింజ రసంలో కంటే 20 రెట్లు 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది.
* ఉసిరికాయ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం