కొవ్వును తీసేసే కొత్త విధానాలు ఏమిటో తెలుసా...?

బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు... ఒక్కటేమిటి ఇలాంటి అనేక సమస్యలకు మూలకారణం ఒక్కటే. అదే స్థూలకాయం. ఆకర్షణీయమైన రూపాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యాన్ని దూరం చేసే స్థూలకాయం నుంచి బయటపడాలంట

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2016 (15:52 IST)
బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు... ఒక్కటేమిటి ఇలాంటి అనేక సమస్యలకు మూలకారణం ఒక్కటే. అదే స్థూలకాయం. ఆకర్షణీయమైన రూపాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యాన్ని దూరం చేసే స్థూలకాయం నుంచి బయటపడాలంటే జీవనశైలి మార్చుకోవడం ఒక మార్గం. కానీ అది చెప్పినంత సులభం కాదు. అయితే సత్వరమే స్థూలకాయాన్ని తగ్గించి, అందమైన రూపాన్ని, ఆరోగ్యాన్ని అందజేసే చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగని ఇవి అపరేషన్లు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ నాన్‌సర్జికల్ విధానాలే అని అంటున్నారు ప్రముఖులు.
 
ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన కార్పొరేటీకరణ కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాల సంఖ్యను పెంచింది. తద్వారా శారీరక శ్రమ లేకుండాపోయింది. వండుకుని తినడానికి సమయం లేక ఇన్‌స్టంట్‌గా అందుబాటులో ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ లాగించేసే అలవాటు పెరిగింది. తద్వారా శరీరంలో కొవ్వు పెరగడం మొదలయింది. ఫలితంగా అందమైన రూపం కాస్తా వికారంగా మారుతోంది. అందానికి ఎసరు పెట్టడమే కాకుండా శరీరంలో పేరుకున్న కొవ్వు రకరకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. అందుకే కొవ్వును కరిగించుకోవడం కోసం రకరకాల చికిత్సల కోసం పరుగులు తీస్తున్నారు. డైటింగ్‌లు చేసినా, జిమ్‌ల వెంట తిరిగినా కొవ్వు కరగడానికి చాలా రోజులు పడుతుంది. కానీ వైద్యచికిత్సలతో వెంటనే ఫలితం లభిస్తుంది. అందుకే వీటికి ఆదరణ పెరుగుతోంది.
 
నో సర్జరీ ...!
పురుషుల్లో ముఖ్యంగా పొట్టభాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఆ తరువాతే మిగిలిన భాగాల్లో కూడా నిలువ అవుతుంది. స్త్రీలలో పొత్తి కడుపు భాగంతో పాటు తొడలు, నడుము, పిరుదులు, కొంతమందికి మెడ భాగంలో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. కాబట్టి మిగిలిన శరీర భాగాల కన్నా ఆయా భాగాల్లో ఎక్కువ లావుగా కనిపిస్తారు. కొంతమందికైతే కాళ్లు చేతులు సన్నగా ఉండి పొట్ట భాగంలో మాత్రం కొవ్వు పేరుకుపోయి కనిపిస్తారు. కొంతకాలం క్రితం వరకు ఈ అదనపు కొవ్వును తొలగించడానికి శస్త్రచికిత్స సంబంధమైన వైద్యం అందుబాటులో ఉండేది. 
 
అయితే ఈ చికిత్సల వల్ల సైడ్ఎఫెక్టులు రావడం జరిగేది. కానీ ఇప్పుడు శస్త్రచికిత్సల జోలికి వెళ్లకుండా కొవ్వును తొలగించడం సాధ్యమవుతోంది. వీటినే నాన్‌సర్జికల్ విధానాలు అంటున్నారు. ఇటువంటి చికిత్సల కోసం శరీరంపై ఎటువంటి గాటు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నొప్పి, రక్తస్రావంలాంటి సమస్యలు ఉండవు. చికిత్సా సమయంలో మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చికిత్స అనంతరం అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. చికిత్స కోసం ఉద్యోగాలకు సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రొడక్టివిటీపై ప్రభావం ఉండదు.
 
కొవ్వు కరుగుతుందిలా.....!
శరీరంలో పేరుకున్న కొవ్వును తొలగించడానికి అల్ట్రాసోనిక్ విధానాన్ని అనుసరిస్తారు. ఇలా అల్ట్రాసోనిక్ తరంగాలను పంపించి కొవ్వును తీసివేసే పద్ధతిని లైపోకేవిటేషన్ అంటారు. ఎక్స్‌రేలు, అల్ట్రావయొలెట్ తరంగాల మాదిరిగా అల్ట్రాసోనిక్ వేవ్స్ హానికరమైనవి కావు. కాబట్టి వీటి ద్వారా ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా కొవ్వు కణాలను తొలగించవచ్చు. కేవిటేషన్ విధానం ద్వారా శరీరంలోని నిర్దుష్టమైన భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి విద్యుదయస్కాంత లక్షణాలు కలిగిన తరంగాలను అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. 
 
ఈ తరంగాల వేడికి ఘనరూపంలో ఉండే కొవ్వు ద్రవరూపంలోకి మారుతుంది. ఇది కాలేయానికి చేరి తరువాత మూత్రం ద్వారా బయటకు విసర్జన పంపించబడుతుంది. ఈ విధానాన్ని రొమ్ములు, పిరుదలు, పొత్తి కడుపు, చేతుల పైభాగం, తొడల వంటి భాగాల్లోని కొవ్వును తొలగించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కాస్మెటిక్ వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మకమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. ఈ చికిత్సా విధానాల ద్వారా కొవ్వును తొలగించడమే కాకుండా జారినపోయిన స్తనాలను సరిచేయవచ్చు. వదులైన చర్మాన్ని బిగుతుగా చేయవచ్చు.
 
 ముఖం మీద ఏర్పడిన వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చు. అయితే ఒక్క సిట్టింగ్‌లోనే అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దు. వ్యక్తి, సమస్యను తీవ్రతను బట్టి సిట్టింగ్‌లు అవసరమవుతాయి. డాక్టర్ల సూచన మేరకు అవసరమైన సిట్టింగ్స్‌లో చికిత్స తీసుకోవాలి. చికిత్స తరువాత నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామాలు చేయాలి.
 
కాంతులీనే చర్మం కోసం.....!
టీనేజ్‌లో ఏర్పడే మొటిమల నుంచి చర్మంపై వచ్చే ముడతల వరకు అన్నీ అందాన్ని దెబ్బతీసే సమస్యలే. మొటిమలు, మచ్చలు, పులిపిర్లు, జుట్టురాలడం, చర్మం కాంతి కోల్పోవడం లాంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ ఆధునిక కాస్మెటిక్‌లతో పరిష్కారం లభిస్తోంది.
 
చికిత్సలు
చర్మాన్ని బిగుతుగా చేయడం, ఫిగర్ కరెక్షన్, వెయిలాస్, బ్రెస్ట్ లిఫ్టింగ్, ఫ్రాక్షనల్ లేజర్, పీల్స్, మైక్రోడెర్మ్ అబ్జార్షన్, డెర్మ్‌రోలర్, రేడియో ఫ్రీక్వెన్సీ, లైపోకేవిటేషన్, నాన్ సర్జికల్ లైపో, ఆర్.ఎఫ్, సెల్లోఫేజ్, లేజర్ చికిత్స, స్టెమ్‌సెల్ థెరపీ వంటి ఆధునిక చికిత్సలు సౌందర్యాన్ని పెంపొందించడానికి, బరువును తగ్గించి ఆకర్షణీయమైన శరీరాకృతిని అందించడానికి ఉపయోగపడుతున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎనిమిదేళ్ల కుమార్తెను నాలుగో అంతస్థు నుంచి కిందికు విసిరేసిన తల్లి

పెళ్లై 15 ఏళ్లయినా భార్య మరొకరితో వివాహేతర సంబంధం, కన్నీటి పర్యంతమైన భర్త

Jagan: కోటి సంతకాల సేకరణ ఉద్యమం-తిరుగులేని ప్రజా తీర్పు: వైస్ జగన్ ట్వీట్

కొత్తగా పెళ్లి చేసుకుని జడుగ్గాయిలా భర్త, అసలు ఇలాంటి వారికి పెళ్లెందుకు?

కారులో బ్రేక్ అనుకుని యాక్సిలేటర్ తొక్కేసాడు, ఒకరు మృతి- ముగ్గురికి తీవ్ర గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

Shivaji: మన వారితో తీసిన దండోరా కమర్షియల్ అంశాల అద్భుతమైన చిత్రం - నటుడు శివాజీ

Peddi: ఐదు భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన చికిరి చికిరి సాంగ్

Show comments