రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:20 IST)
మధ్యాహ్నం భోజనమో లేకుంటే రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించే అలవాటు ఉంటే దానిని మార్చుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే పొట్ట బాగా పెరుగుతుంది. అందుకే ఆహారం తీసుకున్న గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రించాలి. నిద్రించేటప్పుడు బోర్లా పడుకుంటే.. పొట్టలోని కొవ్వు కరుగుతుంది. 
 
పొట్ట పూర్తిగా తగ్గాలంటే.. జంక్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్, చిప్స్ వంటివి తీసుకోకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే మంచిది. ఇక ఎక్కువగా నీరు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం వలన పొట్టను తగ్గించుకోవచ్చు. కానీ రాత్రిపూట 9 గంటల తర్వాత నీరు తాగడాన్ని కాస్త తగ్గించాలి. ఆహారాన్ని హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినాలి. నెమ్మదిగా తినడం వలన తక్కువ తినొచ్చు. తద్వారా కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గొచ్చు. 
 
పొట్ట తగ్గాలంటే.. సాల్ట్ తక్కువగా తినాలి. బీపీ ఉన్నవారు ఉప్పును బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటే ఫ్యాట్ పెరుగుతుంది. అలానే శ్వాస లోతుగా పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ శ్వాసకు సంబందించిన వ్యాయామాన్ని చేయాలి. శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే నీరు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవాలి. వాటర్ మెలోన్, పీయర్స్ వంటివి తింటే మంచిది.
 
పొట్టకు సంబంధించిన వ్యాయామాలతో పాటు రోజూ అరగంట నడవండి. నడక అన్నిటికీ మేలు చేస్తుంది. ప్రతి రోజూ కొంచెం దూరంగా నడవడం వలన పొట్ట తగ్గడమే కాకుండా, కాళ్ళు కూడా సన్న పడతాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

తర్వాతి కథనం
Show comments