ఉప్పు అధికంగా తింటే.. ఏమవుతుందో తెలుసా..?

Webdunia
బుధవారం, 31 జులై 2019 (17:31 IST)
ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేని ఆహారం తినాలంటే చాలా కష్టం. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి.
 
ఉప్పు మంచిదే.. అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎక్కువగా ఉప్పు తింటే.. కలిగే సమస్యలు ఓసారి తెలుసుకుందాం..
 
1. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటాం. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకుంటే.. సరిపోతుంది.
 
2. ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా సహించదు. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది.
 
3. ఉప్పు అధిక మోతాదులో తీసుకునే వారి శరీరంలో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బుతుంది. అక్కడే వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది. అందుకు కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తినేవారిలోనే ఈ సమస్య వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి.
 
4. ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో నీరు త్వరగా అయిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా ఈ సమస్య వేసవికాలంలోనే వస్తుంది. కనుక ఉప్పు తగ్గిస్తే మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments