Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రకాల టీ... అవి తాగితే ఫలితాలేంటి?

మనలో చాలామంది టీ తాగుతూ ఉంటారు. కానీ ఎలాంటి టీ తాగితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో చాలామందికి తెలియదు. ఒక్కసారి ఆ వివరాలను పరిశీలిద్దాం... బ్లాక్ టీ బ్లాక్ టీలో కెఫీన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఎముకలకు, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (21:49 IST)
మనలో చాలామంది టీ తాగుతూ ఉంటారు. కానీ ఎలాంటి టీ తాగితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో చాలామందికి తెలియదు. ఒక్కసారి ఆ వివరాలను పరిశీలిద్దాం...
 
బ్లాక్ టీ
బ్లాక్ టీలో కెఫీన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఎముకలకు, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఓ కప్పు బ్లాక్ టీ తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరం మాయిశ్చరైజ్ అవుతుంది.
 
గ్రీన్ టీ
బరువు తగ్గాలా... అయితే రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ పొడులు మార్కెట్లలో లభిస్తున్నాయి. ఒక కప్పులో 50-150 ఎంజీల యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు నియంత్రిస్తాయి. కెఫీన్ లేని గ్రీన్ టీ తాగడం ద్వారా ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. పిల్లలకు అర కప్పు నుంచి ఒక కప్పు వరకే గ్రీన్ టీ ఇవ్వాల్సి వుండగా, పెద్దలు 2 నుంచి 4 కప్పుల గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా 100-750 ఎంజీల యాంటీయాక్సిడెంట్లు లభించినట్లవుతాయి. 
 
గ్రీన్ టీ యాంటీ-బయోటిక్‌గా పనిచేస్తుంది. తద్వారా అలెర్జీలు దూరమవుతాయి. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. సూర్యకిరణాల నుంచి శరీరాన్ని పరిరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నిర్మూలిస్తుంది. ఓరల్ క్యాన్సర్‌కు గ్రీన్ టీ చెక్  పెడుతుంది. దంతాలను బలపరుస్తుంది. దంత సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియత్రిస్తుంది. స్నాక్స్ టైమ్‌లో ఓ కప్పు గ్రీన్ టీని తాగడం ద్వారా హై-కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఊలాంగ్ టీ
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ ఒక్క రోజులో శరీరంలోని దాదాపు 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా దీన్ని తాగడం ద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్‌పై ఇది ఫైట్ చేస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది.
 
ఊలాంగ్ టీ ద్వారా ఊబకాయం ఈజీగా తగ్గుతుంది. గ్రీన్ టీ కంటే మరింత మెరుగైన ప్రయోజనం దీని ద్వారా లభిస్తుంది. శరీరంలోని ఫ్యాట్‌ను వెంటనే బర్న్ చేసే గొప్ప గుణం దీనికి ఉంది. అయితే దీన్ని రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగడం అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఊలాంగ్ టీలో రిచ్ యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, మాగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ ఏబీసీఈ కే వంటి పోషకాలున్నాయి. ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ టీ బరువు తగ్గించడంతో పాటు చర్మానికి మేలు చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒత్తిడిని నిరోధిస్తుంది. 
 
వైట్ టీ
వైట్ టీ సహజసిద్ధమైన తీయదనాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని టీల కంటే సున్నితమైనదిగా ఉంటుంది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది. అలాగే చర్మం నిగారింపును కూడా ఇస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

తర్వాతి కథనం
Show comments