Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరిక్ యాసిడ్ ఎందుకు వస్తుంది? నిరోధించే మార్గం ఏంటి?

Webdunia
సోమవారం, 30 మే 2022 (22:27 IST)
యూరిక్ యాసిడ్. ఈ రోజుల్లో ప్రతి రెండవ వ్యక్తి అధిక యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం వుంటుంది. కీళ్లనొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం వుంటుంది. ఈ వ్యాధి మోకాళ్లు, చీలమండలు, వేళ్లలో నొప్పితో మొదలవుతుంది.

 
యూరిక్ యాసిడ్ అదుపు చేసేందుకు ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ బేకింగ్ సోడా మిశ్రమం యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెపుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గించడానికి, ప్రతిరోజూ ఆహారంలో విటమిన్ సి తీసుకుంటూ వుండాలి. ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ రెండు నెలల్లో గణనీయంగా పడిపోతుంది. నారింజ, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది.

 
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుకే మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా,
డైటరీ ఫైబర్ రక్తం నుండి యూరిక్ యాసిడ్‌ను గ్రహిస్తుంది, మూత్రపిండాల ద్వారా బయటకు పంపుతుంది. వంట కోసం వెన్న లేదా వెజిటబుల్ ఆయిల్‌కి బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించాలి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఏర్పడకుండా చేస్తుంది.

 
ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు, ఊబకాయం ఉన్నవారికి యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి. ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే, యూరిక్ యాసిడ్ పెరుగుదలను నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాలి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు దూరంగా ఉండాలి. ఇవి సాధారణంగా చేపలు, దాని నూనెలలో కనిపిస్తుంది.

 
అధిక యూరిక్ యాసిడ్ వచ్చే ప్రమాదం ఉన్నందున సంతృప్త కొవ్వులు, కేకులు, పేస్ట్రీలు, కుకీలు మొదలైన వాటిని దూరంగా వుంచండి. బాటిల్ వాటర్ తాగడం హానికరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments