Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈగలతో టైఫాయిడ్ వచ్చే కాలం... ఈ వ్యాధి ఎలా వస్తుంది...?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (18:24 IST)
టైఫాయిడ్. ఈ వ్యాధి వచ్చిందంటే రోగి మంచంలో వణికిపోతాడు. సరైన సమయంలో గుర్తించకపోతే కనీసం 10 నుంచి 12 రోజుల పాటు మంచంలో లంఖణాలు చేయాల్సింది. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది... దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
 
వ్యాధి లక్షణాలు
టైఫాయిడ్ జ్వరం ప్రారంభంమైనప్పటి నుంచి మొదలు 3 వారాల దాకా ఉండవచ్చు. ఈ జ్వరం "శాల్మోనెలా టైఫై" అనే క్రిమి వల్ల సోకుతుంది. ఇదే జాతికి చెందినదే "పారాటైఫాయిడ్" అనే మరో రకం జ్వరం కూడా ఉంది.
 
జ్వరంతో ప్రారంభమైయ్యే టైఫాయిడ్ రోజురోజుకీ క్రమంగా ఎక్కువవుతూ వారం రోజుల్లో 40 డిగ్రీల దాకా పెరిగిపోతుంది. ఆ దశలో తలనొప్పి కూడా ఉంటుంది. సకాలంలో చికిత్స పొందినప్పటికీ ఈ వ్యాధి దాదాపు మరో రెండుమూడు వారాల వరకు ఉండే అవకాశముంది.

టైఫాయిడ్ వ్యాధి క్రిముల్ని వెంటనే నిరోధించక పోయిన పక్షంలో వ్యాధి ముదిరి, అవాంతర రోగాలు కూడా రావచ్చు. నిమోనియా, హృదయం బలహీనపడటం, ప్రేగులలోనుంచి రక్త స్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకుపోతుంది. టైఫాయిడ్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలను సైతం హరిస్తుంది.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు
టైఫాయిడ్ సోకిన వెంటనే వైద్య చికిత్స తప్పనిసరి. ఇంటి దగ్గర ఉంటూనే చికిత్స తీసుకోవచ్చు. వైద్యుడు ఇచ్చే మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. టైఫాయిడ్ సోకిన వారు ఆహారం విషయంలోను జాగ్రత్త అవసరం.

తేలికగా అరిగేవిధమైన ద్రవాహారాన్నే ఏక్కువగా తీసుకోవాలి. అంటే తగిన మోతాదులలో చల్లార్చిన గంజి, పాలు, నీళ్ళు కలిపిన అన్నం, పళ్ళ రసం, కొబ్బరి బొండాం నీళ్ళు, గ్లూకోస్, కోడి గ్రుడ్లు ఆహారంగా తీసుకోవచ్చు. జ్వరంవల్ల అధికంగా చెమటలు పోస్తూ ఉంటాయి, అందువల్ల తరచు రోగికి దాహంవేస్తుంది. నోరెండిపోకుండా కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి.
 
జ్వరం వచ్చిన తరువాత వారం రోజులు మామూలుగా స్నానం చేయవచ్చు. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తడి గుడ్డతో దేహాన్ని తుడవాలి రోగికి గాలి వీచే ప్రాంతంలో కూర్చోబెట్టాలి. తద్వారా జ్వరం త్రీవతను తగ్గించగలము. టైఫాయిడ్ సోకిన వారిలో కొందరికి విరేచనాలు, వాంతులు కూడా ఉంటాయి. అటువంటివారు పాలు తాగకూడదు. పాలను నిమ్మరసం పిండి, విరగ్గొట్టి- వడబోసిన ఆ విరుగుడు తేట మాత్రమే తీసుకోవాలి.
 
టైఫాయిడ్ జ్వరం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా ఆహార విషయంలో రోగి జాగ్రత్త వహించాలి. సుమారు రెండు వారాలపాటు ఆహార నియమం పాటించాలి. కడుపులో వ్రణం ఆరడానికి కనీసం 10, 15 రోజులు పడుతుంది. కనుక ద్రవరూపంలోనే పోషక ఆహారం రోగికి ఎక్కువగా ఇస్తూ ఉండడం మంచిది. కారం, పులుపు సంబంధించి పధార్థాలను దరిచేరనివ్వకండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments