Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వున్నవారు చేయాల్సినవి

Webdunia
బుధవారం, 5 మే 2021 (23:35 IST)
శరీరానికి నీరు చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి. పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలను తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది.
 
రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి.
 
తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments