Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్‌పాక్స్ వచ్చే సీజన్ ఇదే.... తస్మాత్ జాగ్రత్త... మచ్చలు పోవాలంటే....

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కవగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి అంటువ్యాధి లాంటిది కనుక ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా సోకుతుంది. ఈ వ్యాధి నివారణకు మందులు లేవు. కేవలం జాగ్రత్తలతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవ

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (16:16 IST)
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లలు, గర్భిణులు ఎక్కవగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి అంటువ్యాధి లాంటిది కనుక ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా సోకుతుంది. ఈ వ్యాధి నివారణకు మందులు లేవు. కేవలం జాగ్రత్తలతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, ఎసైక్లోవిర్ యాంటివైరల్ మందుల ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమైన వెరిసెల్లా వైరస్ గాలి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిని (అమ్మవారు, తట్టు) వంటి పేర్లతో పిలుస్తారు. సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధి ఇది. 
 
వ్యాధి లక్షణాలు ముఖ్యంగా చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు శరీరంపై ఎరుపురంగు బొడిపెలు వస్తాయి. ఈ బొడిపెలలో నీరు లాంటి ద్రవం నిండి ఉండి శరీరంతో పాటు నోరు, నాలుక, తల, కనురెప్పలు, చెవులు వంటి భాగాల్లో కూడా ఇవి వస్తుంటాయి. సుమారు ఐదు రోజుల నుంచి పదిరోజుల వరకు ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారిని తాకినా, వారి దుస్తులను వేసుకున్నా ఈ వైరస్ సోకుతుంది. 
 
అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా చిన్న పిల్లలకు 12 నెలల నుంచి 15 నెలల మధ్య కాలంలో యాంటీ వైరస్ ఇంజక్షన్ వేయాలి. ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకుంటు తాజా పండ్లు, కూరగాయాలు, రసాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధిని అశ్రద్ధ చేయరాదు.
 
శరీర చర్మంపై ఏర్పడే చికెన్‌పాక్స్ మచ్చలు పోవాలంటే నిమ్మరసంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. ఇంకా చికెన్‌పాక్స్ మచ్చలు మాయమవ్వాలంటే పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలోని చికెన్‌పాక్స్ మచ్చలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక పింపుల్స్ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలా చేస్తే పింపుల్స్ ఉండవని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే బొప్పాయి చెట్టు నుంచి వచ్చే పాలను కాసింత తీసుకుని అందులో నీటిని చేర్చండి. ఈ బొప్పాయి పాలు, నీటి మిశ్రమంలో నానబెట్టిన జీలకర్రను కలపండి 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంలోని మచ్చలు మటుమాయం అవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం