కోల్డ్ కాఫీ తీసుకుంటున్నారా.. జాగ్రత్త..?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (15:43 IST)
చాలామంది ఉదయాన్నే లేవగానే వేడివేడిగా కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఎందుకంటే.. కాఫీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని వారి నమ్మకం. అలానే శరీరానికి కావలసిన ఎనర్జీ కూడా వస్తుందని చెప్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో కోల్డ్ కాఫీ తాగేవారు ఎక్కువగా ఉన్నారు. వేడి వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ తీసుకోవడమే మంచిదని కొందరి నమ్మకం.
 
కానీ, అది అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆఫీసుల్లో పనిచేసేవారు ఏమనుకుంటారంటే..  కోల్డ్ కాఫీ తాగితే అలసట ఉండదని. అయితే అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఇది తప్పని తేలింది. కోల్డ్ కాఫీ కంటే వేడి వేడి కాఫీనే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు అధ్యయనంలో తెలియజేశారు.
 
అసలు విషయం చెప్పాలంటే.. కోల్డ్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటే వేడి కాఫీలోనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహ వ్యాధి నుండి కాపాడుతాయి. కనుక వీలైనంత వరకు కోల్డ్ కాఫీలు తీసుకోవడం మానేయండి.. లేదంటే జీర్ణాశయ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంతో పాటు మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments