Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పులు ఎన్ని రకాలు ...!

Webdunia
శనివారం, 26 మార్చి 2016 (09:11 IST)
తలనొప్పులు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు ఎక్కువ సమయం నిద్రపోతే లేదా తక్కువ సమయం నిద్రపోతే, నిద్ర సరిగా పట్టకపోతే కూడా తలనొప్పి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు నిద్రనుండి మధ్యమధ్యలో మేల్కొంటుంటే కూడా తలనొప్పి వస్తుందంటున్నారు వైద్యులు. 
 
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విపరీంతగా వ్యాయామం చేస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి గ్లూకోజ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మెదడుకు గ్లూకోజ్ సరిగా అందదు. దీంతో తలనొప్పి తీవ్రంగా వస్తుందంటున్నారు వైద్యులు.
 
దంతాలలో తీవ్రమైన నొప్పి ఉండటంతో తలనొప్పి వస్తుంది. దంతాల్లో క్రిములుండటం, జ్ఞానదంతం రావడం, తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది.  
 
మానసికపరమైన ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుందంటుంది. దీంతో పాటు నిద్రలేమి, అలసట తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది. కళ్ళజోళ్లు మార్చకపోయినా తలనొప్పి వస్తుంటుంది. విపరీతంగా తలనొప్పి వస్తుంటే కంటి నిపుణుల వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలంటున్నారు వైద్యులు. 
 
అప్పుడప్పుడు కొన్ని మందులు, మాత్రల ప్రభావంతోనూ తలనొప్పి వస్తుంటుంది. ఉదాహరణకు గుండె  జబ్బులకు సంబంధించి వాడే మాత్రలు, మందులు...రక్తపోటును అదుపులో ఉంచేందుకు వాడే మాత్రల ప్రభావంతో తలనొప్పి వస్తుంది. 
 
మైగ్రేన్ తలనొప్పి... తలలోని ఓ వైపు మాత్రమే ఈ తలనొప్పి వస్తుంటుంది. దీనికంతటికి కారణం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. అధిక ఒత్తిడి కారణంగా కూడా ఈ నొప్పి వస్తుంటుంది.
 
జలుబు, వాతావరణ పరిస్థితుల మార్పులు, ధూమపానం ఎక్కువగా సేవించడం కారణంగా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి శుభ్రతను పాటిస్తూ... మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోండి. మరీ విపరీతంగా తలనొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments