Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా జాగ్రత్తలు పాటించకపోతే డయాబెటిస్ చేసే డ్యామేజ్ అంతాఇంతా కాదు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (22:34 IST)
మధుమేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అది చేసే డ్యామేజ్ అంతాఇంతా కాదు. డయాబెటిస్ అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవి కనిపించవు. రెటినోపతిలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే.. ముందుస్తు పరీక్ష ఒక్కటే మార్గం.

 
కంటి చూపు బాగుంది కాబట్టి నా కళ్లకేం ప్రమాదం లేదని మాత్రం మధుమేహులు అనుకోకూడదు. కంట్లో డ్రాప్స్ వేసి 15 నిమిషాలు కూర్చోబెట్టి కంటిని పరీక్ష చేస్తే రెటీనోపతి ఉందా.. ఏ దిశలో ఉంది.. అనే విషయాలు వైద్యులు తేలిగా కనిపెట్టేస్తారు. కాబట్టి ఏడాదికోసారి తప్పనిసరిగా మధుమేహులు కంటి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

 
పెద్ద రక్తనాళాలతో సంబంధం ఉండే మూత్రపిండాలు మధుమేహం అదుపు తప్పితే దెబ్బ తింటాయి. రక్తంలోని చక్కెర నేరుగా సరఫరా అవుతూ ఉంటే మూత్రపిండాల నుండి ప్రోటీన్స్ లీక్ అవడం మొదలు పెడతాయి. ఇదే కొనసాగితే మూత్రపిండాలు పాడై పని చేయకుండా పోతాయి. అప్పుడి డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది.

 
ఈ సమస్యలోనూ చివరి దశ వరకూ లక్షణాలేవీ ఉండవు. కాళ్ల వాపులు కనిపించినా అప్పటికే మూత్రపిండాల సమస్య చివరి దశకు చేరుకుందని అర్థం. మూత్రపిండాలను సంరక్షించుకోవాలంటే ప్రోటీన్స్ లీకేజ్‌ను ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించే చికిత్స తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments