Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ రోగులు : ఆహార నియమాలు

Webdunia
మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధిబారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతా ఇంతా కాదు. దీనికి పడే ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. దీనికి ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.

ఉదయం 6 గంటలకు : అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించండి.

ఉదయం 7 గంటలకు : టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు తీసుకోండి.

ఉదయం 8.30 గంటలకు : ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోండి.

ఉదయం 10.30 గంటలకు : ఒక 50గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించండి.

మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు : రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతోబాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

సాయంత్రం 4 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు ఆహారంగా తీసుకోవాలి.

సాయంత్రం 6 గంటలకు : ఒక కప్పు సూపు తీసుకోండి.

రాత్రి భోజనం 8.30 గంటలకు : మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూటకూడా ఆహారం తీసుకోవాలి.

రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించండి.

ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి.

పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోండి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండండి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

Show comments