Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూడిల్స్‌లో ఏమున్నాయి? ఇన్స్‌స్టెంట్‌ నూడిల్స్ తింటే?

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (16:06 IST)
రెండే నిమిషాల్లో నూడిల్స్‌ తయారు చేసేసి.. పిల్లలకు తినిపిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. అసలు న్యూడిల్స్‌లో ఏముందో తెలుసుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పిల్లలకు ఇష్టపడి తినే నూడిల్స్‌లో ప్రమాదాలు చాలా ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 
 
నూడిల్స్‌లో క్యాండిల్ లేదా లిక్విడ్ ఫారఫిన్ అనేవి చేర్చబడుతున్నాయి. ఇవి నూడిల్స్‌ను అతుక్కోకుండా చేస్తాయి. వీటితో కలిపిన నూడిల్స్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
 
నూడిల్స్‌లో చేర్చే క్యాండిల్ మన శరీరానికి కావలసిన విటమిన్స్, ధాతువులను మింగేస్తాయి. తద్వారా మెదడు సంబంధిత రోగాలు తప్పవు. అంతేగాకుండా.. హర్మోన్ల ఉత్పత్తికి బ్రేక్ వేస్తాయి. చర్మాన్ని, కేశాలను సంరక్షించే విటమిన్లను కరిగిస్తాయి. 
 
క్యాండిల్స్ కలిపిన నూడిల్స్ తినడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు, హైబీపీ, ఒబిసిటీ, మధుమేహం వంటి వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూడిల్స్‌లో ఉపయోగించే క్యాండిల్స్ అనే పదార్థం ద్వారా మెదడుకు అందే విటమిన్స్‌ నిరోధించబడతాయి. తద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. 
 
నూడిల్స్‌లోని మైదా రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం ద్వారా టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది. ఇంకా నూడిల్స్‌లో చేర్చే బ్లీచింగ్, అలోక్సన్‌ల ద్వారా ఇన్సులిన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా మధుమేహం తప్పదు. 
 
పిల్లలకు, మహిళలకు నూడిల్స్ తీసుకోవడం ద్వారా చాలా ప్రమాదాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నూడిల్స్‌లోని బిస్పినాల్ ఎ అనే పదార్థం మహిళల్లో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్లను దెబ్బతీస్తోంది.
 
అయితే సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే నూడిల్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలేనని, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అందుకే తృణధాన్యాలు, బియ్యం, రాగి, సజ్జలతో తయారు చేసే నూడిల్స్‌ను కొనాలని వారు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, బి-6, నియాసిన్, మాగ్నీషియం వంటివి ఉన్నాయి. 
 
ఇవి శరీరానికి కావలసిన ఇన్సులిన్ శాతాన్ని నిరోధించి చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇన్స్‌స్టెంట్ నూడిల్స్‌తో ఆరోగ్యానికి దెబ్బేనని వారు హెచ్చరిస్తున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments