Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు వదలరా.. నిద్ర మత్తు వదలరా...! సంధికాలాల్లో జాగ్రత్త అవసరం...!

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (17:27 IST)
మన జీవితాల్లో కొన్ని సంధికాలాలుంటాయి..! చదువయ్యాక డిగ్రీ నుంచి ఉద్యోగాలకు వెళ్లడం అలాంటిదే. ఈ దశల్లో మనం కచ్చితమైన నిద్రవేళలు పాటించాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంత నిద్రనీ త్యాగం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మానసికంగా, శారీరకంగా చికాకులూ తప్పవు. వాటిని అధిగమించడానికి ఇలా చేసి చూడండి.
 
నిద్రించే వేళలను కచ్చితంగా పాటించాలి: పుట్టినప్పటి నుంచి స్కూలుకు వెళ్లే వరకు రోజుకు 18 గంటల నిద్రోపోయే మనిషి ఆ తరువాత ఆటలు, చదువు అంటూ నిద్రించే సమయం తగ్గించుకుంటాడు. ఏదెలా ఉన్నా... డిగ్రీకి వచ్చేప్పటికి సెలవులన్నీ కలుపుకుని సగటున ఎనిమిది గంటలు నిద్రపోతారని ఓ అంచనా.

ఉద్యోగంలోకి వచ్చాక ఆ సమయం మరో గంట తగ్గించుకుని తీరాల్సి ఉంటుంది. అయితే కొత్త అలవాటు కారణంగా అది కుదరని పరిస్థితిగా మారుతుంది. అటువంటి సమయంలో ముఖ్యంగా కచ్చితమైన నిద్ర వేళలు పాటించండి. 21 రోజులు వరుసగా ఆ సమయాలనే పాటిస్తే... అదే మీ జీవితంలో భాగమైపోతుంది.
 
సూర్య రశ్మి పడడం మంచిది:
కొత్త నిద్రవేళలు పాటించేప్పుడు ఉదయం పూట ఎండలో నిల్చోవడం ఓ అలవాటుగా మార్చుకోండి. తద్వారా నిద్ర తక్కువైందనే చికాకుపోయి కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. అంతేకాదు.. ఈ ఉదయం పూట ఎండలో నిలబడడం ద్వారా రాత్రి మనం మరింత గాఢంగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.
 
వ్యాయామం ఉత్తమం:
కొత్త నిద్రవేళలు మీ శరీరానికీ మనసుకీ పూర్తిగా అలవాటయ్యేదాకా.. దాని ప్రభావం ఏకాగ్రతా విశ్లేషణ సామర్థ్యంపై పడుతూనే ఉంటుంది. దాన్ని కొంత వరకూ నివారించాలంటే ఉదయం లేవగానే కాసేపు వ్యాయామం చేయడంకానీ, నడవడం కానీ చేయాలి. ఆఫీసులోనూ మధ్యాహ్నం వేళ ఓ పది నిమిషాలు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇలా చేయకపోతే కార్యాలయాల్లో కునుకుపాట్లు తప్పవు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments