Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలని దిండులో దాచుకుని పడుకునే అలవాటుంటే?

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (18:51 IST)
మెదడు చురుగ్గా పనిచేయాలా? చలాకీగా మారిపోవాలా? అయితే అలవాట్లను మార్చుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. 

అల్పాహారం తరచూ మానేయడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడుకి సరైన పోషకాలు అందవు. దాంతో అది చురుగ్గా పనిచేయదు. తినకపోవడం ఎంత చేటో, అతిగా తినడమూ అంతే చేటు . అతిగా తినడం వల్ల మెదడుకు సంబంధించిన నాళాలు మొద్దుబారి, మెదడు చురుగ్గా పని చేయలేదు. 
 
పంచదార వాడకాన్నీ వీలైనంత వరకు తగ్గించాలి. ఎందుకంటే దాని వాడకం ఎక్కువైతే ఆహారం నుంచి శరీరం పోషకాలని స్వీకరించడం తగ్గిస్తుంది. దీనివల్ల పోషకాహార లేమి ఏర్పడుతుంది. తద్వారా చలాకీగా ఉండలేకపోతారు. 
 
నిద్రలేకుండా పనిచేయకండి. నిద్ర మెదడును శక్తిమంతం చేస్తుంది. నిద్రలేకుండా పనిచేస్తుంటే మెదడులోని కణాలు చచ్చుబడిపోయే ఆస్కారం ఎక్కువ. తలని దిండులో దాచుకుని పడుకునే అలవాటుంటే ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే దీనివల్ల మెదడుకి ఆక్సిజన్ బదులుగా మీరు వదిలిన కార్బన్‌డై ఆక్సైడ్ అందుతుంది.

అదీ కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడూ శరీరం సహకరిస్తోందని పనిచేస్తుంటాం.. కానీ మెదడు పని చేయవద్దని సంకేతాలిస్తే ఆ పని ఆపేయడం మంచిది. లేదంటే తీవ్ర అలసటకూ, అనారోగ్యానికి గురవుతాం. మెదడులోని కణాలు నిర్వీర్యమై పనిచేయడం మానేస్తాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments