Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి కాకర మేలు.. కాయగూరలు మానాల్సిన పనిలేదు..!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:55 IST)
ఇటీవల కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ జబ్బు రాగానే పలు రకాల ఆంక్షలు ఆహారం విషయంలో వస్తాయి. అయితే వాటిలో వైద్యులు పెట్టే ఆంక్షలు తక్కువ, ఇరుగు పొరుగు చెప్పినవి విని అనుసరించేవి ఎక్కువగా ఉంటాయి. షుగర్ జబ్బు వచ్చినంత మాత్రాన కాయగూర విషయంలో ఆంక్షలు అనవసరం. 
 
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస, వంకాయ, కాకర, బెండ, టొమోటో, ముల్లంగి, మిరప వంటివి ఏవీ మానక్కరలేదు. వీటిలో ఉండే పిండి పదార్థాలు చాలా తక్కువ. అయితే ఏ వంటకాన్ని అతిగా తినకూడదు. మితంగా ఏదైనా తినవచ్చు. బాగా ఉడికించక తక్కువగా ఉడికించినవి లేదా పచ్చివి తినగలిగితే బాగుంటుంది. 
 
ముఖ్యంగా కొన్ని రకాల కాయగూరలు షుగర్ జబ్బు వారికి చాలా మేలు చేస్తాయి. వాటిలో మొదటి స్థానంలో వచ్చేది కాకరకాయ. కాకరను ఇన్సులిన్ కాయ అని కూడా అంటారు. ఇందులో ఇన్సులిన్ లక్షణాలు కలిగిన జీవరసాయనం ఉంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారి కాకర తింటే రక్త, మూత్ర చక్కెరల్లో షుగర్ స్థాయి తగ్గుతుంది. కాకరను షుగర్ జబ్బు ఉన్నవారు తరచుగా తినవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments