Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్రలో ఈ రోజు ఆగస్టు 10 ఎన్నో ఆసక్తికర అంశాలు, చూడండిక్కడ

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (09:32 IST)
సంఘటనలు
 
610: ఇస్లాం మతంలో సాంప్రదాయంగా, అతి పవిత్రమైన లయలత్ అల్ ఖదర్ రోజు. ఈ రోజున, ముహమ్మద్ ప్రవక్త, అతి పవిత్రమైన ఖురాన్ని అందుకున్నాడు.
 
1519: ఫెర్డినాండ్ మాగెల్లాన్, ఐదు నౌకలతో, ప్రపంచాన్ని చుట్టిరావడానికి, సెవిల్లె నుండి బయలు దేరాడు.
 
1680: మెక్సికోలో పెబ్లో (ప్యూబ్లో) ఇండియన్స్, స్పెయిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు.
 
1743: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు.
 
1792: లూయిస్ XVI రాజభవంతి పై ఫ్రెంచ్ ప్రజలు దాడి చేసారు.
 
1821: అమెరికా 24వ రాష్ట్రంగా మిస్సోరిని అమెరిక సెనేట్ అమోదించింది.
 
1833: చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21, 85, 283; 1920 సంవత్సరంలో 27, 01, 705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26, 95, 598 (తగ్గిన జనాభా) .
 
1840: కెనడాలో ఎగిరిన మొదటి బెలూన్ (గాలి గుమ్మటం) పేరు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్
 
1846: స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను అమెరికాలో స్థాపించారు.
 
1866: ట్రాన్సాట్లాంటిక్ కేబుల్ ని, అట్లాంటిక్ మహాసముద్రంలో వేశారు. దీనివలన ఖండాంతర దేశాలకు టెలిఫోన్ సౌకర్యం కలిగింది.
 
1877: రైలు ప్రయాణాన్ని, మొదటిసారిగా, టెలిఫోన్ వాడుతూ (నియంత్రిస్తూ) పంపించారు.సిడ్నీ మైన్స్ రైల్వే దగ్గర ఉన్న, గ్లేస్ బేలో ఉన్నటువంటి, కాలెడోనియా మైన్ (గని) వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ గని యజమానులలో, ఒకడైన, అలెగ్జాండర్ గ్రాహంబెల్ మామగారైన, గార్డినెర్ జి. హబ్బర్డ్, రెండు టెలిఫోన్లు పెట్టి, వాటి ద్వారా రైలు ప్రయాణాన్ని నియంత్రించాడు.
 
1893: జర్మనీ లోని ఆగస్బుర్గ్ వద్ద 1893 ఆగష్టు 10, నాడు రుడాల్ఫ్ డీజిల్ యొక్క ప్రధాన మోడల్ (10 అడుగుల సిలిండర్, ఒక చక్రం) మొదటిసారి తన సొంత శక్తి (వేరుశనగ నూనె) తో పరుగులు పెట్టింది. ఈ కారణంగా, ఆగష్టు 10వ తేదీని ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (ప్రపంచ శాకాహార నూనె దినోత్సవం)గా పాటిస్తున్నారు.
 
1945: జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది.
 
1948: అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎ.బి.సి.) నెట్‌వర్క్ టి.వి దశ లోకి ప్రవేశించింది.
 
1958: యు.ఎస్.ఎస్. స్కేట్ అమెరికా యొక్క మూడవ అణు జలాంతర్గామి. ఇది, ట్రాన్స్-అట్లాంటిక్ (అట్లాంటిక్ మహాసముద్రం అవతల నుంచి ఇవతల వరకు) దాటింది. ఉత్తర ధృవం చేరిన రెండవ అణు జలాంతర్గామి. ఉత్తర ధృవం సముద్ర జలాల నుంచి పైకి వచ్చిన మొదటి అణు జలాంతర్గామి.
 
1961: అమెరికా సైన్యం మొట్టమొదటిసారిగా వియత్నాం దక్షిణ ప్రాంతంలో ఏజెంట్‌ ఆరెంజ్‌(ఎఒ)/ డయాక్సిన్[permanent dead link]ను చల్లడం ప్రారంభించి, 1971 మధ్య కాలానికి, నాల్గింట ఒక వంతు భూభాగంలో 61 శాతం విషపూరిత రసాయనాలు, 366 కిలోల డయాక్సిన్‌తో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల లీటర్ల ఏజెంట్ ఆరంజ్ ను చల్లింది. దక్షిణ వియత్నాం పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి, 48 లక్షల మంది వియత్నామీయులు ఏజెంట్ ఆరెంజ్ బారిన పడేలా చేసింది. ఆ దుష్ఫలితాలు రెండవ, మూడవ తరాలవారితో సహా సుమారు 30 లక్షల మంది ఇప్పటికీ బాధపడుతున్నారు.
 
1974: ఈనాడు తెలుగు దిన పత్రిక విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జూలై=డిసెంబరు 2010 సర్వే ప్రకారం 16, 70, 750 కాపీలు పంపిణీ జరుగుతున్నది.
 
1988: నార్త్ సీ,, బాల్టిక్ సముద్రం లలో ఉన్న సీల్ జంతువులకు, విచిత్రమైన జబ్బు సోకి, 6000 సీల్ జంతువులు మరణించాయి. ఆ జబ్బు, బ్రిటిష్ జలాలలో ఉన్న సీల్ జంతువులకు కూడా సోకింది.
 
1988: ఐక్య రాజ్య సమితి, ఆసియా ఖండం యొక్క జనాభా 3 బిలియన్లు (300 కోట్లు) అని ప్రకటించింది. భారతదేశపు జనాభా, ఈ క్షణంలో కావాలి అంటే ఇక్కడ నొక్కండి.
 
1990: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్ర గ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్ర గ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.
 
2000: ప్రపంచ జనాభా పెరుగుదలను, ప్రతిక్షణం, గమనించే, ఇబిబ్లియో అనే వెబ్‌సైటు, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరుకుందని ప్రకటించింది. ప్రపంచ జనాభా గడియారం. ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలి అంటే ఇక్కడ నొక్కండి.
 
2003: ఎన్నడూ లేని ఎండ వేడికి (100 డిగ్రీల పారెన్‌హీట్ కి పైనే) బ్రిటన్ వాసులు మల మల మాడిపోయారు. దేశంలోని, సముద్రపు ఒడ్డులు, జనసముద్రమే అయ్యాయి. రహదారులు అన్నీ, ట్రాఫిక్ మూలంగా, అదుపు తప్పాయి.
 
2009: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
 
జననాలు
 
1782: ఛార్లెస్ జేమ్స్ నేపియర్, బ్రిటిష్ సైనిక దళాధిపతి (ఆర్మీ జనరల్) (మ.1853).
 
1855: అల్లాదియా ఖాన్ - హిందుస్తానీ సంగీతంలో జైపూర్- అత్రౌలీ ఘరానా పద్ధతిని ఆరంభించిన గాయకుడు.(మ.1946)
 
1874: హెర్బర్ట్ హూవర్ అమెరికా 31వ అధ్యక్షుడు (మ.1964) .
 
1894: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి (మ.1980).
 
1914: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత (మ.1977).
 
1918: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985)
 
1929: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి (మ.2017).
 
1932: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు (మ.2010).
 
1933: తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (మ. 2021)
 
1945: దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (మ. 2021)
 
1946: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు (మ.2015).
 
1962: నందమూరి లక్ష్మీపార్వతి, రచయిత్రి, హరికథా కళాకారిణి, నందమూరి తారక రామారావు రెండవ భార్య.
 
2005: "ప్రణమ్య మెనారియ" [1] 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి "దేవేంద్ర హర్నె" [2] జననం 1995 జనవరి 9.
 
మరణాలు
 
1945: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882)
 
1988: అరియాస్ అర్నుల్ఫో, పనామా దేశ అధ్యక్షుడు ( మూడు సార్లు) (జ.1901).
 
పండుగలు , జాతీయ దినాలు
 
1893: ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (ప్రపంచ శాకాహార నూనె దినోత్సవం)
 
నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం
 
డెంగ్యూ వ్యాధి నిర్మూలనా దినం. (ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం’ చేపడుతోంది.)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments