Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ బర్త్ డే టూ "యునైటెడ్ నేషన్స్"

Webdunia
FILE
అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి పనిచేసే సంస్థ "ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్)". ఈ సంస్థ "ఐక్యరాజ్యసమితి"కి అనుబంధంగా పనిచేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంగతలా పక్కనబెట్టి.. ఐక్యరాజ్య సమితి అంటే ఏంటో చూద్దాం... అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకుగానూ ప్రపంచదేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థే ఇది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించటంలో విఫలమైన కారణంగా.. దానికి ప్రత్యామ్నాయంగా 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది. కాబట్టి.. ఈ సంస్థ స్థాపించబడిన రోజును ప్రతియేటా "ఐక్యరాజ్యసమితి దినోత్సవం"గా ప్రపంచమంతటా జరుపుకుంటారు.

ఐరాస స్థాపనకు దారి తీసిన పరిణామాల విషయానికి వస్తే.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1941వ సంవత్సరం ఆగస్టు నెలలో అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌లు అట్లాంటిక్ ఓడలో సమావేశమై ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్నే అట్లాంటిక్ చార్టర్ అని పిలుస్తుంటారు. ప్రాదేశిక సమగ్రతను కాపాడటం, యుద్ధ భయాన్ని తొలగించటం, శాంతిని నెలకొల్పటం, నిరాయుధీకరణ లాంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో చోటు చేసుకున్నాయి. ఇవే తరువాత ఐరాస సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందాయి.

ఆ తరువాత 1944లో వాషింగ్టన్‌లో డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐరాస ప్రకటనా పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో పై దేశాల నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఓ అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానించారు. శాన్‌ప్రాన్సిస్కో నగరంలో 1945 ఏఫ్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొన్ని ఐరాస ఛార్టర్‌పై సంతకాలు చేశారు. ఆ తరువాత 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి లాంఛనంగా ప్రారంభమైంది.

ప్రస్తుతం 192 దేశాలు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్యసమితిలో ప్రధానంగా ఆరు అంగాలు పనిచేస్తున్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీనికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్. సర్వ ప్రతినిధి సభలో ఐక్యరాజ్యసమితిలో ప్రవేశించే అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా.. భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. వాటిలో పది దేశాలు రెండేళ్లకోమారు ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతాయి. మరో 5 దేశాలు మాత్రం శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లు.

సమితి ఆశయాల విషయానికి వస్తే.. యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మద్య స్నేహసంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.. తదితరాలుగా చెప్పవచ్చు.

సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం.. అనేవి ఐరాస ఆరు ప్రధాన అంగాలు. ఈ సంస్థకు అనుబంధంగా పనిచేసే సంస్థల విషయానికి వస్తే... ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్), ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డీపీ), ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఈపీ)లు ఉన్నాయి.

ఇంకా ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ, ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్, విశ్వ తపాలా సంఘం- యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ప్రపంచ వాతావరణ సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎమ్.ఎఫ్.) అనే మొత్తం 16 సంస్థలు ఐరాసకు అనుబంధంగా పని చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments