Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయాలు ఎలా పుట్టాయో తెలుసా..?

Webdunia
FILE
సాధారణంగా మనదేశానికి ఉత్తర సరిహద్దు ఏంటని అడిగితే..? వెంటనే "హిమాలయా పర్వతాలు" అని ఠక్కున చెప్పేస్తుంటాం. అయితే అసలు ఈ హిమాలయాలు ఎలా పుట్టాయి, వాటి వయసెంత..? అనే ప్రశ్నలు అడిగితే మాత్రం కాస్త తడబడాల్సిందే..! ఇంతకీ ఈ పర్వతాలు ఎప్పుడు, ఎలా పుట్టాయి.. వాటి వయసెంత.. తదితర విషయాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలూ.. ఇప్పుడు మీ వయస్సు ఎంత..? అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ బర్త్ సర్టిఫికెట్ ద్వారా చూసి అలా చెప్పవచ్చుగానీ.. హిమాలయాలకు అలా ఉండదు కదా..! ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం ఇవి పుట్టినప్పుడు మనుషులే ఉండేవారు కాదు. అలాంటప్పుడు అవి ఎలా పుట్టాయి, వాటి వయస్సెంత..? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. భూ పరిశోధనలే మార్గం.

రెండు భాగాలు ఢీకొట్టటం వల్లనే..
ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ... ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటునే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయా పర్వతాలు పుట్టాయన్నమాట..!
కాబట్టి.. శాస్త్రవేత్తలు భూమిని పరిశోధించి, చాలా ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అవేంటంటే.. ఇప్పటిదాకా మనమంతా.. హిమాలయా పర్వతాలు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తూ వస్తున్నాం. అయితే అది తప్పని... 139 నుంచి 144 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు పుట్టినట్లు తాజా పరిశోధనల ద్వారా వారు కనుక్కొన్నారు.

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు ఇప్పట్లాగా ఉండేవి కావు. అవన్నీ కలిసి దగ్గరదగ్గరగా ఒకేచోట ఉండేవి. అయితే అవి నెమ్మదిగా దూరం జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయాయి. వాటినే గోండ్వానాలాండ్, లారాసియా అని పిలుస్తారు. ఇప్పుటి మన భారత భూభాగం అప్పట్లో గోండ్వానాలాండ్‌లో ఓ చిన్న ముక్కలాగా ఉండేది.

ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ... ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న చోటునే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయా పర్వతాలు పుట్టాయన్నమాట..!

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు భూఫలకాలూ ఢీకొనటం ఇంకా ఆగిపోలేదట. భారత భూఫలకం ఉత్తరదిశంగా ఏడాదికి 67 మిల్లీమీటర్ల వంతున కదులుతూనే ఉందట. అందుకనే హిమాలయాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి.

హిమాలయాల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే.. హిమాలయాలుగా పిలుచుకునే ఈ పర్వతాల వరస పొడవు 3 వేల కిలోమీటర్లు. ఇవి ఆప్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, పాకిస్థాన్ దేశాలను తాకుతూ విస్తరించాయి. ఈ హిమాలయాల నుంచి జారే మంచు హిమానీనదులు (గ్లాసియర్స్)గా మారుతుంది. ఇలాంటివి 15 వేల దాకా ఉన్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments