Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రం నీలంగా ఉంటుందెందుకు...?

Webdunia
FILE
పిల్లలూ.. చెరువులు, బావులు, నదులలోని నీటిని చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి. అదే సముద్రం నీళ్లు మాత్రం నీలంగా ఉంటాయి కదా..! మరి అవి అలా ఎందుకు ఉంటున్నాయో మీకెప్పుడయినా సందేహం వచ్చిందా...?! సముద్రం నీరు ఎప్పుడూ నీలం రంగులోనే ఉండేందుకు గల కారణం.. ఆకాశం రంగు నీటిపై ప్రతిబింబిచడం వల్లనే అని అనుకుంటున్నారా..? అలా అనుకోవటం తప్పు.

ఎందుకంటే... నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లటం వల్లనే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంటుంది. అంటే.. సూర్యుడి కాంతి భిన్న తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి తరంగాలతో నిర్మాణమై ఉంటుంది. ఈ తరంగాలు ఒక్కో తరంగ దైర్ఘ్యం వద్ద ఒక్కో రంగును సూచిస్తుంటాయి. నీలం రంగు తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని, ఎరుపురంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి.

అయితే వాతావారణంలో వాయు, ద్రవ, ఘన స్థితులలో ఉండే వివిధ పదార్థాలు భూమిని చేరే సూర్యుడి కాంతిని గ్రహిస్తాయి. ఈ పదార్థాలన్నీ చాలా చిన్న పరిమాణంలో రేణువులుగా ఉండటంవల్ల తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని అంటే నీలం రంగు కాంతిని గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టే ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంటుంది.

అదే విధంగా సూర్యుడి కాంతి సముద్రాన్ని తాకగానే చిన్నగా ఉన్న సముద్రజల రేణువులు కూడా అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగునే గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టి మనకు సముద్రం ఎప్పుడు చూసినా నీలంగానే కనిపిస్తుంటుంది. అంతేగానీ ఆకాశం రంగు నీటిపై ప్రతిఫలించి మాత్రం కాదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments