Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంపై రోమాలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయో తెలుసా...?

Webdunia
గురువారం, 4 జులై 2013 (18:35 IST)
WD
అదో భయంకర దృశ్యం.... హీరో చేతిలో గన్ కింద పడిపోయింది.. విలన్ హీరోపై పిస్తోలు గురిపెట్టాడు. మరో సీను చూడండి... భారత్, పాకిస్థాన్ల మధ్య ఒక రోజు క్రికెట్ జరుగుతోంది. పాకిస్థాన్ 354 పరుగు చేసింది. భారత్ ఎదుట 355 పరుగుల లక్ష్యం. హరిభజన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా 49.5 ఓవర్లలో 349 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది.

అదే లాస్ట్ వికెట్... ఒక్క బాల్ ఉంది. ఆరు పరుగులు తీయాలి. తీస్తాడో లేదో.... ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది. అనిపించేదేముంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తమకు స్వయంగా నష్టం కలుగినట్లు తెగ ఫీలైపోతాం. ఎందుకిలా....? ఏమిటీ అసంకల్పిత చర్య. దీనిపై పరిశోధన చేసిన మానసి శాస్త్రవేత్తలు ఎందుకూ ఏమిటీ అనే విషయాన్ని చెపుతున్నారు.

వాషింగ్టన్‌లోని గ్రోనిన్జిన్ విశ్వవిద్యాలయానికి చెందిన నాడీ మండల విభాగానికి చెందిన పరిశోధకులు చాలామందిపై పరిశోధన చేశారు. పరిశోధనలోకి తీసుకున్న వారిని ఎఫ్ఎంఆర్ఐ స్కానర్‌తో పరిశీలించారు. మొదట ఒక నటుడు టీ తాగుతున్న దృశ్యాన్ని చూపించారు. తరువాత ఓ పుస్తకం వారికిచ్చి చదివించారు. ఆ దృశ్యాలను ఊహించుకోమని చెప్పారు. వీధుల్లో నడుస్తున్న దృశ్యాలను, ఓ తాగుబోతు వాంతి చేసుకునే దృశ్యాలను వారికి చూపించారు.

వీటన్నింటిపై మెదడు స్పందించే విధానాన్ని స్కానర్ల ద్వారా పరిశీలించారు. తమ పరిశీలనలో మెదడులోని యాంటిరియర్ ఇన్సులాపై దృష్టి సారించారు. అన్నిరకాల అనుభవాలకు ఇది గుండె వంటిది. వివిధ ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ భాగం దెబ్బతిన్నవారిలో ఎటువంటి ఫీలింగ్స్‌ ఉండవని పేర్కొన్నారు. ఆ శక్తిని కోల్పోతారని తేల్చేశారు.

వారికి చెడిపోయిన పాలిచ్చినా వారు చాలా ఆనందంగా తాగేస్తారు. వారికది సోడాలాగా అనిపిస్తుంది. రుచిని గుర్తించే శక్తిని కోల్పోవడం వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. సాధరణంగా పుస్తకం చదువుతున్నపుడో లేదా మంచి సినిమా చూస్తున్నపుడో ఇదే విధమైన భావన కలుగుతుంది. అందుకే గుండె వేగంగా కొట్టుకోవడం, రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments