Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిస్టర్ మజిల్స్"కు జన్మదిన శుభాకాంక్షలు

Webdunia
సాగి లక్ష్మీ వెంకటపతి రాజు 1969, జూలై 9వ తేదీన ఆలమూరులో జన్మించాడు. కుడిచేతి వాటంగల బ్యాట్స్‌మన్‌గా, ఎడమచేతివాటం స్పిన్నర్‌గా భారత జట్టులో రాణించిన రాజును క్రీడాభిమానులంతా "మిస్టర్ మజిల్స్" అనే ముద్దుపేరుతో పిలిచేవారు. 1990లలో కుంబ్లే-చౌహాన్‌లతో కూడిన భారత స్పిన్ త్రయంలో ఒకడిగా రాణించిన రాజుకు.. మనిందర్ సింగ్ ఫింగర్ స్పిన్నింగ్ స్టైల్‌ ఆదర్శం.

నైట్ వాచ్‌మన్‌లా ఏకధాటిగా ఆడి...!
  రాజు న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే... నైట్ వాచ్‌మెన్‌లాగా రెండు గంటలపాటు క్రీజులో నిలబడి ఏకధాటిగా బ్యాటింగ్ చేశాడు. రాజుకు అవతలివైపున వచ్చిన ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ బాట పట్టినా, 31 పరుగులు సాధించాడు...      
1989-90 డొమెస్టిక్ సీజన్‌లో భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన వెంకటపతిరాజు 32 వికెట్లను సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తరువాత అంతర్జాతీయ క్రీడా జీవితాన్ని ప్రారంభించిన రాజు న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మరియు వన్డే మ్యాచ్‌లలోనూ బాగా రాణించాడు.

రాజు న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే... నైట్ వాచ్‌మెన్‌లాగా రెండు గంటలపాటు క్రీజులో నిలబడి ఏకధాటిగా బ్యాటింగ్ చేశాడు. రాజుకు అవతలివైపున వచ్చిన ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ బాట పట్టినా, 31 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. టీం ఇండియాలో ప్రాముఖ్యం కలిగిన ఆటగాడిగా కొనసాగిన రాజు 1990లలో ఇంగ్లండ్ పర్యటనకు కూడా ఎంపికయ్యాడు.

అయితే ఈ పర్యటన చివర్లో గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోర్ట్నీ వాల్స్ విసిరిన బంతి దెబ్బకు... రాజు ఎడమచేతి వేలు పగిలిపోయింది. దీంతో రాజు భారత్ తిరిగి వచ్చేశాడు. ఆ తరువాత కోలుకుని శ్రీలంక జట్టుతో చండీఘర్‌లోని సెక్టర్ 16 స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదే మ్యాచ్ రెండో రోజున విజృంభించి బౌలింగ్ చేసిన రాజు శ్రీలంక మిడిల్ ఆర్డర్‌ను కుప్పగూల్చి 39 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తీశాడు. ఆ తరువాత రోజున ఇంకో వికెట్‌ను తీసిన రాజు ఈ టెస్ట్‌మ్యాచ్లో 17.5 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి, 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాకుండా... అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 53 ఓవర్లలో 37 పరుగులిచ్చి 8 వికెట్లు సాధించి "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

రాజు అంతర్జాతీయ కెరీర్‌లో చివరిగా, చెన్నైలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో మార్క్ వా వికెట్ తీయడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు. భారత మేటి బౌలర్ అయిన అనిల్ కుంబ్లే సమకాలికుల్లో ఒకడైన వెంకటపతిరాజు ఉత్తమమైన స్పిన్ బౌలర్‌గా జట్టుకు ఎనలేని సేవలను అందించాడు.

హైదరాబాద్ జట్టు తరపున చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడిన వెంకటపతిరాజు 1999-2000లలో జరిగిన రంజీ ట్రోఫీలో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. 2004 డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన డొమెస్టిక్ మ్యాచ్ తదనంతరం రాజు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన భారత క్రికెట్ జట్టు సౌత్ జోన్‌ సెలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

యువఆటగాళ్లతో కూడిన నేటి టీం ఇండియాలో రాణిస్తున్న లెగ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఒక ఇంటర్వ్యూలో వెంకటపతిరాజు బౌలింగ్ నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందానని చెప్పడం రాజు స్పిన్ మాయజాల ఆటతీరుకు నిదర్శనం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments