Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపాలను కప్పలు ముందుగానే పసిగడతాయా?

Webdunia
FILE
కుక్కలు, ఎలుకలు, కోళ్లు మొదలైన జంతువులు భూకంపాల రాకను గుర్తిస్తాయి అని చాలా సార్లు రుజువైంది. అయితే కప్పలు కూడా ముందు గానే పసిగడతాయని ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. 'జర్నల్ ఆఫ్ జువాలజీ'లో ఇటీవలి కాలంలో ప్రచురించిన అధ్యయన వివరాలు ఇలా ఉన్నాయి... గత సంవత్సరం ఇటలీలో లాక్విలాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి మూడురోజుల ముందే కొన్ని కప్పలు అవి కలుసుకొనే ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి.

ఆ కప్పలు కలుసుకొనే చోటుకి భూకంపం సంభవించిన ప్రాంతం 74 కి.మీ దూరంలో ఉంది. ఆ తర్వాత పదిరోజులకు గానీ ఆ కప్పలు వెనక్కు తిరిగి రాలేదు. ఈ సంగతిని రాచెల్ గ్రాంట్ అనే జీవ శాస్త్రవేత్త చెప్పారు. రాచెల్ గ్రాంట్ కప్పల ప్రవర్తన, ప్రత్యుత్పత్తిపై చంద్రుని ప్రభావం గురించి ప్రయోగాలు చేస్తున్నారు.

దానికోసం ఒక ప్రాంతంలోని కప్పల్ని ప్రతిరోజూ రాచెల్ గమనిస్తున్నారు. భూకంపం సంభవించే ముందు మూడు రోజులు అవి రాకపోవటాన్ని గమనించారు. ఈ పరిశోధన జంతువులు భూకంపాలను ముందుగానే పసిగడతాయనే వాదనకు బలాన్ని ఇచ్చింది. అయితే కొంతమంది అమెరికన్ శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనలను అంగీకరించడం లేదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Show comments