Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు" కథా, కమామీషు...!

Webdunia
పిల్లలూ...! మనం తరచుగా పేపర్లలోనూ, టీవీల్లోనూ.. బుల్లెట్ గాయాలు, బుల్లెట్ దూసుకుపోయింది.. లాంటి విషయాలను చదువుతుంటాం, చూస్తుంటాం. మరి ఈ బుల్లెట్లు, బుల్లెట్‌ఫ్రూట్ జాకెట్ల కథా కమామీషేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ బుల్లెట్లను దేంతో తయారు చేస్తారో తెలుసా..? వీటిని సీసంతో తయారు చేస్తారు. సీసం చాలా విషపూరితమైంది. ఇది గనుక చాలా రోజులు మనిషి శరీరంలో ఉండిపోతే కొన్నిరోజులకు ప్రాణాలు పోవటం మాత్రం ఖాయం. మరి హింస రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రైఫిళ్లు, మిషన్ గన్‌ల నుంచి బుల్లెట్లు ఎప్పుడు, ఎవరిపైకి దూసుకు వస్తాయో కూడా తెలియదు కదా.

అందుకే.. ఇలాంటి బుల్లెట్లనుండి రక్షణ పొందేందుకే మిలటరీ కమెండోలు "బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్ల"ను ధరించి వారి విధులను నిర్వహిస్తుంటారు. ఈ జాకెట్లను తొడుక్కున్నట్లయితే... పది మీటర్ల దూరం నుంచి రైఫిల్ పేల్చటంవల్ల వచ్చే తూటాలు ఏమీ చేయలేవు. కాబట్టి, ఈ జాకెట్‌ను ధరించిన వ్యక్తికి ఏ మాత్రం ప్రాణహాని కలుగదు.

బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్‌లో వాడే ఫ్యాబ్రిక్ వేడి, ఆల్ట్రా వయొలెట్ కిరణాలకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రస్తుతం ఈ జాకెట్లు నైలాన్ లేక కెవ్లార్ ఫ్యాబ్రిక్‌తో, సిరామిక్ ప్లేట్లతో తయారవుతున్నాయి. ఈరోజుల్లో పోలీసులు మూడు కేజీల బరువుండే కెవ్లార్ అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను వాడుతున్నారు.

ఇక ప్రత్యేక రక్షక దళాలకు చెందినవారయితే... పది కేజీల బరువుతో... బుల్లెట్‌ఫ్రూఫ్ స్టీలు, సిరామిక్ ప్లేటు, పాలిథైలిన్ ప్లేటు.. అనే మూడింటి పొరలతో కూడిన బుల్లెట్‌ఫ్రూట్ జాకెట్లను ప్రస్తుతం వినియోగిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments