Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్‌లో అప్పుడప్పుడు చప్పుడు.. ఎందుకట..?

Webdunia
FILE
పిల్లలూ..! మన ఇళ్లలోని ఫ్రిజ్ అప్పుడప్పుడూ చిన్నపాటి శబ్దం చేస్తూ ఉంటుంది గమనించారా..? అసలు ఫ్రిజ్‌లోంచి ఆ శబ్దం ఎందుకు వస్తుందంటే.. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలిగించే కంప్రెషర్ ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు చర్యలు జరిగినప్పుడే మనకు శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నమాట...!

ఫ్రిజ్‌లోని కంప్రెషర్‌ను, ఉష్ణోగ్రతను కొలిచే థర్మోస్టాట్ అనేది నియంత్రిస్తూ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత శూన్యానికి అంటే సున్నా డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకోగానే.. ఇక అంతకన్నా తగ్గాల్సిన అవసరం లేకపోవటంతో.. థర్మోస్టాట్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ఏర్పాటు ఉంటుంది. ఇలా ఎప్పుడయితే జరిగిందో మరుక్షణం కంప్రెషర్ కూడా ఆగిపోతుంది. అప్పుడే ఫ్రిజ్‌లోంచి శబ్దం వినిపిస్తుంది.

అయితే.. కాసేపటికే మనకు ఏదైనా వస్తువు అవసరమై ఫ్రిజ్ తలుపు తీయటంవల్లనో, లేకపోతే దాంట్లో లీకేజీవల్లనో చల్లదనం తగ్గిపోతుంది. ఫలితంగా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత సున్నా స్థాయి నుంచి పెరగటం ప్రారంభం అవుతుంది. ఒక స్థాయికి పెరిగిన తరువాత థర్మోస్టాట్ ద్వారా సంకేతం అంది మరలా కంప్రెషర్ ఆన్ అవుతుంది. దాంతో మళ్లీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments