Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిరికితనాన్ని పారద్రోలి.. ధైర్యాన్ని పెంచుతుందట..!!

Webdunia
FILE
ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది.. పురాతన ఈజిప్షియన్ ప్రజలచేత పూజలందుకుంది.. దయ్యాలను తరిమికొట్టే ఆయుధంగా పేరు తెచ్చుకుంది.. పిరికితనాన్ని పారద్రోలేదిగా, సైనికులకు ఆహారంగా, విషానికి విరుగుడుగా.. ఇలా పలు పాత్రలను పోషించేదట.. ఇంతకీ అదేంటో తెలుసా పిల్లలూ..? మనం ప్రతిరోజూ ఆహారంలో తీసుకునే వెల్లుల్లిపాయే..!

వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..?! అయినా ఇది నిజం. ఈ భూమిమీద సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ వెల్లుల్లిపాయ ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచం మొత్తంమీదా ప్రతి ఏడాది పండే పంటలో 75 శాతం చైనాదే కాగా.. ఆ తరువాతి స్థానాల్లో భారతదేశం, దక్షిణ కొరియాలు ఉన్నాయి.

అదలా ఉంచితే.. పురాతన ఈజిప్షియన్ ప్రజలు, రోమన్లు, పర్షియన్లు, గ్రీకులు వెల్లుల్లిపాయను ఔషధంగా గుర్తించి.. ఉపయోగించేవారు. ముఖ్యంగా ఈజిప్షియన్లు వెల్లుల్లిని పూజించేవారట. అందుకనే వీరి అత్యద్భుత కట్టడాలైన పిరమిడ్ల గోడలపైన వెల్లుల్లి బొమ్మలున్నాయి తెలుసా..?
డబ్బుగా కూడా చెలామణి..!
వెల్లుల్లి డబ్బుగా కూడా చెలామణి అయ్యేదట. ఇక ఈజిప్టులో బానిసలచేత వెల్లుల్లిని బాగా తినిపించేవారట. ఎందుకో తెలుసా..? ఇవి తింటే బానిసలకి బోలెడు శక్తి వస్తుందనీ.. దాంతో వారు పని ఎక్కువగా చేస్తారని నమ్మేవారు. పిరమిడ్లు కట్టే బానిసలు చాలా బలంగా ఉండేందుకు...


అలాగే ఈజిప్షియన్ ప్రజలు పిరమిడ్లలో ఉంచే మమ్మీలలో కూడా తప్పనిసరిగా వెల్లుల్లిని ఉంచేవారట. ఈజిప్టు రాజు అయిన టుటాంక్‌మాన్ సమాధిని బయటపడినప్పుడు అందులో కూడా వెల్లుల్లిపాయలు కనిపించటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఒకానొక కాలంలోనయితే.. వెల్లుల్లి డబ్బుగా కూడా చెలామణి అయ్యేదట. ఇక ఈజిప్టులో బానిసలచేత వెల్లుల్లిని బాగా తినిపించేవారట. ఎందుకో తెలుసా..? ఇవి తింటే బానిసలకి బోలెడు శక్తి వస్తుందనీ.. దాంతో వారు పని ఎక్కువగా చేస్తారని నమ్మేవారు. పిరమిడ్లు కట్టే బానిసలు చాలా బలంగా ఉండేందుకు కూడా వీటిని తినిపించేవారట.

పిరికితనం ఉన్నవారు వెల్లుల్లిని తింటే ధైర్యం వస్తుందని పురాతన గ్రీకు ప్రజలు బలంగా నమ్మేవారట. అందుకే యుద్ధానికి వెళ్లేముందు సైనికులకు ఆహారంగా పెట్టేవారట. రోమన్లు కూడా యుద్ధాల్లో గాయాలైనప్పుడు, తేలు లాంటి విష కీటకాలు కరిచినప్పుడు విరుగుడుగా వెల్లుల్లి రసాన్ని ఉపయోగించేవారట.

క్షయ, ఆస్తమా లాంటి రోగాలకు కూడా మందుగా వాడేవారట. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సైన్యం సైనికుల గాయాలను మాన్పేందుకు కూడా వెల్లుల్లినే మందుగా వాడిందట. ఇకపోతే... వెల్లుల్లికి దెయ్యాలను తరిమికొట్టే ఆయుధంగా కూడా మంచి గుర్తింపు ఉందట. మధ్యయుగంలోని ప్రజలు వీటిని గుమ్మాలకు కట్టుకునేవారట. అలా వెల్లుల్లిని గుమ్మాలకు కట్టుకుంటే దయ్యాలు, భూతాలు ఇంట్లోకి ప్రవేశించవని వారి విశ్వాసం.

చివరిగా... ఆరోగ్యపరంగా చూస్తే, మానవ శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బీ, సీలతో పాటుగా.. కాల్షియం, కాపర్, ఇనుము, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల పోషకాలు వెల్లుల్లిలో ఉన్నాయి. కాబట్టి పిల్లలూ..! ఇప్పటిదాకా వెల్లుల్లి అంటే మీకు ఇష్టం లేకపోయినా, దాని వెనుక దాగి ఉన్న నిజాలను తెలుసుకున్న తరువాత.. తినకుండా ఉండలేరు కదూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments