Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీనికి మహాసిగ్గు.. అలికిడయితే చాలు పరార్...!!

Webdunia
FILE
సాధారణంగా దీనివల్ల ప్రమాదం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. దీనికి మహా సిగ్గు. ఏ మాత్రం అలికిడి అయినా సరే ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించకుండా పారిపోతుంది. అయితే చంపేందుకు మాత్రం ప్రయత్నిస్తేనే తన తడాఖా ఏంటో చూపిస్తుంది. దానిపేరే "ఇన్‌లాండ్ తైపాన్". కేవలం ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే జీవించే ఒక రకమైన పాము పేరే ఈ ఇన్‌లాండ్ తైపాన్.

ఇన్‌లాండ్ తైపాన్ పాముకి గనుక కోపం వచ్చి కాటు వేసిందంటే.. కేవలం 45 నిమిషాల కాలంలోనే మనిషి ప్రాణాలు హరీమంటాయి. దీని ఒక కాటులో విడుదలయ్యే విషం ఎంత ప్రమాదకరమంటే.. వంద మంది మనుషుల ప్రాణాలను తీయగలదు. రెండు లక్షల యాభై వేల ఎలుకలను చంపగలదు. అందుకే ఈ భూమిమీద తిరుగాడే పాములన్నింటిలోకెల్లా దీనిని అత్యంత విషపూరితమైనదిగా గుర్తించారు.

ఈ పాము ఒక్క కాటులో విడుదల అయ్యే విషం దాదాపు 44 మిల్లీగ్రాములుంటుంది. మిగతా పాములతో పోల్చి చూసినట్లయితే.. దీని విషం చూపించే ప్రభావం ఎంతంటే.. ఎడారుల్లో జీవించే "ర్యాటిల్ స్నేక్" విషంకంటే 200 నుంచి 400 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే తాచుపాము విషం కంటే 50 రెట్లు అధికంగా ఉంటుంది.

శరీరంపై సన్నటి గీతలతో కూడిన డిజైన్‌తో ఉండే ఈ ఇన్‌లాండ్ తైపాన్ పాములు దాదాపు ఆరడుగులదాకా పొడవు పెరుగుతుంటాయి. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఇవి ఒక్కో రుతువులో ఒక్కో రంగులో కనిపిస్తుంటాయి. అంటే.. చలికాలంలో నల్లగా, వేసవికాలంలో గోధుమరంగులోకి మారిపోతుంటాయి.

వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ తైపాన్ పాములు పగటి వేళల్లో అస్సలు కనిపించవు. ఇవి ఎలుకలు పెట్టుకునే కన్నాల్లోకి దూరి వాటిని తినేసి అక్కడే ఎంచక్కా కాపురం పెట్టేస్తుంటాయి. ఒక్కోసారి 12 చొప్పున ఇవి గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లు రెండు నెలల కాలంలో పిల్లలుగా మారుతుంటాయి.

బాగా ఆహారం దొరికినప్పుడు ఇవి లావుగా అయిపోయి.. కరువు రోజుల్లో, తిండి దొరకని పరిస్థితుల్లో ఏమీ తినకపోయినా బ్రతికేస్తుంటాయి. అలాంటప్పుడు వాటి ఒళ్లు కరిగిపోయి సన్నగా మారుతుంటాయి. ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో దాదాపు 140 జాతుల పాములుండగా.. వాటిలో అధికశాతం విషపూరితమైనవి కావడం గమనార్హం.

అలాగే.. విషం లేని పాములకంటే విషపూరితమైన పాములు ఎక్కువగా ఉండే దేశంగా కూడా ఆస్ట్రేలియా పేరుగాంచింది. అలా విషపూరితంగా ఉండే పాములన్నింటిలోకెల్లా అత్యంత విషపూరితమైనది ఇన్‌లాండ్ తైపాన్. అయితే దీని కాటుకు గురయ్యేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. ఎందుకంటే.. ఇది మహా పిరికిది కాబట్టి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments