Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లదొరల్లారా.. మా దేశం వీడి వెళ్లిపోండి...!!

Webdunia
FILE
సాయుధ శక్తులు సైతం పోరాటం సల్పినప్పటికీ, అహింసాయుతంగా సాగిన భారత స్వాతంత్ర్యోద్యమ స్వరాజ్య సమరం లాంటి పోరాటమేదీ ప్రపంచంలో ఎక్కడా మనకు కనిపించదు. ఈ పోరాటంలో పాల్గొన్న ఎందరెందరో దేశాభిమానులు "రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని" మట్టిగరిపించి భరతమాతను బ్రిటీషు దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేశారు.

బలిదానాలకు ఏ మాత్రం వెనుకాడని ఎంతోమంది దేశభక్తులు చేసిన త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. అత్యధికులు జాతిపిత మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో, అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్య సిద్ధికి ఎనలేని పోరాటం సల్పారు.

సరిగ్గా 67 ఏళ్ల క్రితం ఇదే రోజు (1942 ఆగస్టు 8వ తేదీ)న తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ... 'క్విట్ ఇండియా' నినాదంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. ఆగస్టు 8, 1942వ సంవత్సరం నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసి) బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, మహాత్ముడు గొవాలియాలో ప్రసంగిస్తూ... అహింసా మార్గంలో ఈ ఉద్యమాన్నిజరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బ్రిటీష్ పాలకుల్లో సరికొత్త అలజడి..!
ఆరంభంలో అహింసారూపంలో కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. దేశంలోని అన్నీ నగరాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. కార్మికులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీలు, కాల్పులు జరపడంతో...


స్వాతంత్ర్య పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగినా.. క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింసామార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది. అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న గాంధి, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి పలువురు నాయకులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి అహమ్మద్ నగర్‌లోని పోర్ట్‌ కారాగారంలో బంధించారు.

ఈ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో అహింసారూపంలో కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. దేశంలోని అన్నీ నగరాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. కార్మికులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీలు, కాల్పులు జరపడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

అయినా క్విట్ ఇండియా పోరాటం రోజురోజుకూ తీవ్రమైందే గానీ, ఏమాత్రం తగ్గలేదు. ప్రారంభంలో నగర ప్రాంతాల్లో మాత్రమే ఆరంభమైన ఈ ఉద్యమం చిన్నగా గ్రామాలకు సైతం వ్యాపించింది. ఈ ఉద్యమంలో భాగంగా స్వతంత్ర సమరయోధులపై పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. దీనితో ఆగ్రహించిన సమరయోధులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు.

ఈ పోరాటంలో పాల్గొన్న ఒక లక్షమందిని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. పలు ఉద్యమకారులపై బ్రిటిష్ ప్రభుత్వం కఠినశిక్షలను విధించింది. అయినా ఉద్యమం ఏమాత్రం శాంతించలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజురోజుకి పెరిగిన ఉద్యమం బ్రిటిష్ పాలకుల్లో కొత్త అలజడిని రేకెత్తించింది. ఈ ఉద్యమాన్ని ఆపేందుకు గాంధీ, నెహ్రూ తదితర నాయకులను దక్షిణాఫ్రికాకు తరలించి అక్కడి జైళ్లలో బంధించేందుకు తీర్మానించింది. ఈ వార్తలు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చాయేగానీ ఏమాత్రం ఆగలేదు.

ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నిర్భంధించిన స్వాతంత్ర్య సమరయోధులను విడుదల చేయాలని కోరుతూ గాంధీజీ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష విజయవంతమైంది. ఈ విజయమే బ్రిటిష్ ప్రభుత్వానికి చివరికి పరాజయంగా మారింది. 1857 సంవత్సరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు, 85 సంవత్సరాల అనంతరం క్విట్ ఇండియా ఉద్యమాలు బ్రిటిష్ పాలనకు తెరదించాయి. ఐదేళ్ల తరువాత అదే ఆగస్టు నెలలో స్వతంత్ర భారతావనిగా రూపుదాల్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు