Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తిన్నమ్మకు తినబెడితే... నూనె పెట్టినట్టే" అంటే...?

Webdunia
" తిన్నమ్మకు తినబెడితే... బోడి తలకు నూనె పెట్టినట్టే" అనేది ఒక జాతీయం. ఆపదలలో ఉన్న పేదవారికి సహాయం చేసినట్లయితే ఫలవంతం అవుతుంది. కానీ ఉన్నవారికే ఇంకా ఇంకా అమర్చి పెట్టినట్లయితే, దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండకపోగా, అంతా వ్యర్థమే అవుతుందని చెప్పేందుకు.. ఈ జాతీయాన్ని పోలికగా వాడుతారు.

బాగా కడుపునిండా తిన్నవారికి, ఎలాంటి ఆకలీ లేనివారికి మంచి మంచి ఆహార పదార్థాలను తినమని ఇచ్చినట్లయితే... వాటిని ఎంగిలి చేసి వృధా చేస్తారు తప్ప, వాటిని పూర్తిగా తినలేరు. అదే బాగా ఆకలితో ఉన్నవారికి ఎలాంటి ఆహారాన్ని ఇచ్చినా సరే తృప్తిగా, వృధా చేయకుండా భోంచేస్తారు.

తలనిండా జుట్టున్నవారికి నూనె పెట్టినట్లయితే ప్రయోజనం ఉంటుంది గానీ, బోడి తలకు నూనె పెడదామంటే అదంతా కారిపోయి వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయాలను సూటిగా, ప్రజలకు వాడుకకు దగ్గరగా ఉండేలా మన పెద్దలు "తిన్నమ్మకు తినబెడితే, బోడి తలకు నూనె పెట్టినట్లు" అనే జాతీయాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఈ జాతీయాన్నే రకరకాల సందర్భాలలో, ఆయా విషయాలకు అనుగుణంగా వాడుతుంటారు. ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే... ధనవంతులకు తప్ప, పేదవారికి ఎలాంటి మేలూ చేయకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నదానికి పోలికగా కూడా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments