Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జురాసిక్ పార్క్" క్రైటన్ ఇక లేరు

Webdunia
శుక్రవారం, 7 నవంబరు 2008 (12:35 IST)
పిల్లలూ...! "జురాసిక్ పార్క్" గురించి మీకు తెలిసే ఉంటుంది. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి.

ఈ జురాసిక్ పార్క్ సినిమా కంటే ముందుగా జురాసిక్ పార్క్ అనే నవల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నవల ఆధారంగానే జురాసిక్ పార్క్ సినిమాను రూపొందించాడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. జురాసిక్ పార్క్ సినిమా గురించే మనందరికీ బాగా తెలుసుగానీ, ఆ కథను రాసిన మైకేల్ క్రైటన్ గురించి మాత్రం అంతగా తెలియక పోవచ్చు.

జురాసిక్ పార్క్ సినిమాకు రెండో భాగంగా "ది లాస్ట్ వరల్డ్" అనే సినిమా కూడా వచ్చింది. ఇది కూడా క్రైటన్ కలం నుంచే జాలువారింది. రచయితగా అనేక సంచలనాలు సృష్టించిన ఈ సుప్రసిద్ధ హాలీవుడ్ రచయిత మైకేల్ క్రైటన్ నవంబర్ 6వ తేదీన లాస్‌ఏంజెల్స్‌లో మరణించారు. ఈయన వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు కాగా, భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

1942 వ సంవత్సరంలో షికాగోలో జన్మించిన క్రైటన్ హార్వర్డ్ యూనివర్శిటీలో వైద్యశాస్త్రం చదువుకున్నారు. వైద్యశాస్త్రం చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన 1969లో తన తొలి పుస్తకం "ది అడ్రొమెడా స్రెయిన్"ను రచించారు. ఆ తరువాత జురాసిక్ పార్క్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

క్రైటన్ రాసిన అనేక పుస్తకాల్లో కొన్ని పదికోట్ల కాపీలకు పైగా అమ్ముడుబోయాయి. అంతేగాకుండా ఈయన రాసిన సైన్ ఫిక్షన్ నవలలు విద్యార్థులనే కాకా శాస్త్రవేత్తలను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ కాకుండా క్రైటన్ పలు విజయవంతమైన టీవీ సీరియల్స్‌కు కూడా కథలు రాశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments