Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువులు బ్రష్ చేసుకోకపోయినా ఫర్వాలేదా..?!

Webdunia
FILE
చిన్నూకు పళ్లు తోమటం అంటేనే చిరాకు. పళ్లు తోముకోకుండా తప్పించుకునేందుకు ఇల్లంతా పరుగులు తీస్తుంటాడు. అయినా అమ్మ ఎంత చెప్పినా వినకుండా పళ్లు తోముకునేలా చేస్తోంది. ఒకరోజు తను పళ్లు తోముకోకుండా తప్పించుకునేందు బలమైన సాకు ఒకటి దొరికింది. వెంటనే అమ్మను లాక్కెళ్లి పెరట్లోని ఆవుదూడను చూపించాడు. అది కూడా నాలా చిన్నదే కదా..? అది మాత్రం పళ్లు తోముకోవటం లేదు. మరి నేనేందుకు తోముకోవాలి..? అంటూ తల్లిని ఎదురు ప్రశ్నించాడు.

అబ్బో తన కొడుకుకు ఎంత తెలివో అనుకుంటూ మురిసిపోయిన ఆ తల్లి.. జంతువులు పళ్లు తోమకపోయినా ఫర్వాలేదు నాన్నా. మనం మనుషులం. తప్పకుండా పళ్లు తోముకోవాలి అంటూ నచ్చజెప్పింది. నువ్వు పళ్లు తోముకోకుండా స్కూలుకెళితే నీ ఫ్రెండ్స్‌తో దగ్గరగా కూర్చుని మాట్లాడేటప్పుడు, ఆడుకునేటప్పుడు దుర్వాసన వస్తుంది. దాంతో వాళ్లు నీకు దూరంగా వెళతారు. అప్పుడు నువ్వు బాధపడతావు. అంతేకాకుండా పళ్లనిండా క్రిములు చేరి పంటినొప్పి తెస్తాయని చెప్పింది తల్లి.

పళ్లు తోమకుండా ఉంటే.. వాటిమధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలవల్ల సూక్ష్మక్రిములు ప్రవేశించి నోరు దుర్వాసన రావటమే కాకుండా, పళ్లు పాడవుతాయి. దంతక్షయం ఏర్పడుతుంది. దీంతో పళ్లు ఊడిపోయి కొన్నిరోజులకే అమ్మమ్మ, తాతయ్యల నోరులాగా అయిపోతుంది. దీంతో నీ ఫ్రెండ్స్ అంతా నిన్ను ఆటపట్టిస్తారని చెప్పింది తల్లి.

అదిసరే అమ్మా.. మరి జంతువులు మాత్రం పళ్లు తోముకోవు ఎందుకని..? మరి వాటినోరు దుర్వాసన రాదా..? పళ్లు ఊడిపోవా..? మళ్లీ ప్రశ్నించాడు చిన్నూ. జంతువులకు అలాంటి సమస్యలు రావు చిన్నూ. ఎందుకంటే మనుషుల్లాగా రకరకాల ఆహారాన్ని తినే అలవాటు జంతువులకు లేదు. పీచు బాగా ఉండే ఆకులు, గడ్డిని మాత్రమే అవి తింటాయి.

అదే విధంగా జంతువుల పళ్లు దగ్గదగ్గరగా, పెద్దవిగా ఉంటాయి. వాటి నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. నాలుకలతో పళ్లను పదే పదే నాకుతూ అవి శుభ్రం చేసుకుంటాయి. అదే విధంగా జంతువుల లాలాజలం (ఎంగిలి)లోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివల్ల దంతక్షయం రాకుండా ఉంటుంది. కాబట్టి జంతువులు పళ్లు తోమకపోయినా ఫర్వాలేదు.

ఇప్పుడైనా అర్థమైందా చిన్నూ..? అడిగింది తల్లి. ఓ బాగా అర్థమైందమ్మా.. ఇకపై ప్రతిరోజూ పళ్లు తోముకుంటాను.. నిన్ను ఏడిపించనులే..!! అంటూ బ్రష్ పట్టుకుని స్నానాల గదిలోకి దూరాడు చిన్నూ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments