Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోర్భచెవ్‌కు రోనాల్డ్ రీగన్ బహిరంగ సవాల్...!!

Webdunia
అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, బెర్లిన్ గోడను పగులగొట్టాలంటూ రష్యా అధ్యక్షుడు మిఖాయెల్ గోర్భచెవ్‌కు బహిరంగంగా సవాల్ విసిరిన రోజును చరిత్రలో జూన్ 12వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు. రేడియో వ్యాఖ్యాతగా, హాలీవుడ్ నటుడిగా, కాలిఫోర్నియా గవర్నరుగా బహుముఖ పాత్రలను పోషించిన రీగన్.. 69 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, లేటు వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

1911 వ సంవత్సరం, ఫిబ్రవరి 6వ తేదీన జన్మించిన రోనాల్డ్ రీగన్, రేడియో వ్యాఖ్యాతగా జీవితం ప్రారంభించారు. క్రీడా వ్యాఖ్యాతగా, నటుడిగా కొనసాగుతున్న రీగన్ తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు. 1949లో హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఛైర్మన్‌గా వ్యవహరించినప్పుడు తారసపడ్డ హాలీవుడ్ నటిని తొలిచూపులోనే ప్రేమించారు. తరువాత 1952లో నాన్సీని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు జన్మించారు.

తరువాత రెండుసార్లు కాలిఫోర్నియా గవర్నరుగా ఎన్నికై పనిచేసిన రీగన్... 1981 నుంచి 89 వరకూ రెండుసార్లు అమెరికా అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. రీగన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు... ఆర్థిక శాస్త్రంలో, విదేశాంగ విధానంలో ఏమాత్రం అనుభవం లేని ఆయన ఎలా పాలిస్తారోనని అమెరికాలో చాలామంది విస్మయం వ్యక్తంచేశారు. అయితే సరైన సలహాదారులను నియమించుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అనుభవలేమిని అధిగమించవచ్చునని ఆయన నిరూపించారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో...!
  ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్‌-అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చొరవ చూపింది రీగనే. అప్పట్లో ఆయన భారత ప్రధాని ఇందిరాగాంధీతో సమావేశం జరిపారు. ‘‘ఇక నుంచి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అంతేగానీ ఒకరి గురించి ఒకరు కాదని" అన్నారు.      


ఒకోసారి రీగన్ మాట్లాడుతూ.."నా సలహాదారులు రాత్రిళ్ళూ నాకోసం పనిచేస్తుంటారు. నేను మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతా"నని చమత్కరించేవారు. గొప్ప వక్తగా కూడా పేరుపొందిన ఆయన, అమెరికన్లకు దేశభక్తి స్వరం ప్రసాదించిన మహానేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్‌-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేయటానికి చొరవ చూపింది రీగనే. అప్పట్లో ఆయన భారత ప్రధాని ఇందిరాగాంధీతో కాన్‌కున్‌లో ముఖాముఖి సమావేశం జరిపారు. ‘‘ఇక నుంచి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అంతేగానీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకూడదు’’ అన్నారు. దీంతో తర్వాత్తర్వాత రెండుదేశాలూ సంబంధాలను దృఢతరం చేసుకున్నాయి.

అధ్యక్షుడిగా రీగన్‌ గద్దెదిగిన రెండేళ్ళకు సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైపోయింది. దీంతో రీగన్ చర్యలు, వ్యవహార శైలివల్లనే యూరోపియన్‌ కమ్యూనిజం అంతరించిందని అంటుంటారు. అయితే స్టార్‌వార్స్‌ కార్యక్రమం ద్వారా అమెరికాను అత్యున్నత రక్షణ శక్తిగా తీర్చిదిద్దాలని రీగన్‌ భావించారు. తద్వారా సోవియట్లనూ ఖరీదైన ఆయుధాల పరుగులోకి లాగారు. శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ దీన్ని తట్టుకుంగానీ, రష్యా మాత్రం తట్టుకోలేకపోయింది

1987 లో రీగన్‌ బెర్లిన్‌ను సందర్శించారు. చరిత్రాత్మక బెర్లిన్‌ గోడ వద్ద నిల్చుని.. ఈ గోడను కూలగొట్టండంటూ రష్యా అధ్యక్షుడు మిఖాయెల్‌ గోర్భచెవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి అక్కడ ఆ సమయంలో రష్యా వారెవరూ లేరు. రీగన్‌ తన ప్రకటన ద్వారా తూర్పు జర్మనీలోని స్టాలినిస్టు పాలనపై ఒత్తిడి తెచ్చారు. తరవాత ప్రజాస్వామ్య అనుకూలవాదులు తీవ్ర స్థాయి నిరసన ప్రదర్శనలు చేయటంతో బెర్లిన్‌ గోడను కూలగొట్టారు. 1990 అక్టోబరు 3న రెండు జర్మనీలూ ఒకటయ్యాయి.

తదనంతరం... అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డ రీగన్, పదేళ్ళపాటు ఆ వ్యాధితో పోరాటం చేస్తూ అలసిపోయి 2004 జూన్ 5వ తేదీన కాలిఫోర్నియాలో కన్నుమూశారు. కాగా, మరణించే నాటికి ఆయన వయస్సు 93 సంవత్సరాలు. రీగన్ మరణవార్త విన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ "ఇది అమెరికాకు దుర్దినం" అని ప్రకటించారు.

రీగన్ 93 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో అనేక పాత్రలను పోషించి అలసిన ఆయన, ఓ మంచి ప్రేమికుడిగా భార్య నాన్సీ మదిలో మాత్రం చిరస్థాయిగా నిలిచారు. అధ్యక్షుడయ్యాక కూడా రీగన్‌ తన భార్యకు ప్రేమలేఖలు రాసేవారు. శ్వేతసౌధం చుట్టూ ప్రేమ సందేశాలను పంచేవారు. అందుకు నిదర్శనంగా, నాన్సీ 2000వ సంవత్సరంలో ఆయన రాసిన ప్రేమలేఖలన్నింటినీ ఓ పుస్తకంగా విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Show comments