Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కపిల్ డేర్ డెవిల్స్" చరిత్రలో సువర్ణాధ్యాయం

Webdunia
" క్రికెట్ మక్కా"గా పేరుగాంచిన ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో, నాటి విశ్వవిజేత వెస్టిండీస్‌ను 1983 సంవత్సరం జూన్ 25వ తేదీన ఖంగు తినిపించిన భారత జట్టు.. తొలిసారిగా క్రికెట్‌లో ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్రలో జూన్ 25ను సువర్ణాక్షరాలతో లిఖించింది. "హర్యానా హరికేన్" అని ముద్దుగా పిలుచుకునే "కపిల్ దేవ్" ఆనాటి టీం ఇండియాకు సారధ్యం వహించి విజయంవైపు నడిపించాడు.

ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌గా పిలువబడ్డ ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. నిర్ణీత 60 ఓవర్లలో భారత జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు మట్టి కరపించి 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ చేసి చిరస్మరణీయమైన విజయాన్ని భారత్‌కి అందించారు.
కపిల్ సేనకు బీసీసీఐ సత్కారం
  తొలి ప్రపంచకప్‌ను సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2008వ సంవత్సరంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు "కపిల్ సేన"ను ఘనంగా సత్కరించింది. ఆనాటి మేటి విజయంలో పాలు పంచుకున్న భారత జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడికి తలా రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేసింది.      


సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పింది. చివరిక్షణం వరకూ తాము ఆనాటి జగజ్జేత వెస్టిండీస్ జట్టుపై ఫైనల్లో గెలుస్తామని అసలు ఊహించలేదని చివరివరకూ పోరాడటమే పనిగా పెట్టుకున్నామని కపిల్ అన్నాడంటే... ఆ రోజు మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు.

ఈ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడూ తన పూర్తి శక్తియుక్తులను ప్రదర్శించి, చక్కటి క్రీడాస్ఫూర్తితో ఆడారంటే అతిశయోక్తి కాదు. ఆనాటి జట్టు విజయంలో లిటిల్ మాస్టర్, మేటి ఆటగాడు అయిన సునీల్ గవాస్కర్ ప్రభావం చెప్పుకోదగ్గది. అలాగే తను ముందుండి మొత్తం జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కపిల్, ఆనాటి జట్టులో అతి పిన్న వయస్కుడైన రవిశాస్త్రిల ఆటతీరు, అలాగే పేరు పేరునా జట్టులోని అందరి సభ్యుల కృషిని మరువజాలం.

దాదాపు 50 సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్‌మెన్ మరియు కపిల్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్‌లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ మరియు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్)లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది.

ఇదే క్రమంలోనే పైన మనం చెప్పుకున్నగా... 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి విశ్వవిజేత అయిన వెస్టిండీస్ జట్టును ఫైనల్‌లో బోల్టా కొట్టించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది. ఆ మరుసటి సంవత్సరమే సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఆసియా కప్ క్రికెట్‌ను కూడా భారత జట్టు సాధించింది.

ఇదిలా ఉంటే... భారత జట్టు తొలి ప్రపంచకప్‌ను సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2008వ సంవత్సరంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు "కపిల్ సేన"ను ఘనంగా సత్కరించింది. ఆనాటి మేటి విజయంలో పాలు పంచుకున్న భారత జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడికి తలా 25 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా బీసీసీఐ బహూకరించింది.

ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆనాటి టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్, తన జట్టు సభ్యులందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలోనే "కపిల్ డేర్ డెవిల్స్" బృందం ఆటగాళ్లంతా కలిసి వజ్రాలు పొదిగిన బ్యాటును ఆవిష్కరించిన సంగతి పాఠకులకు విదితమే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments