Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల "అక్వేరియం"కూ ఉందో ముచ్చటైన కథ..!!

Webdunia
FILE
పిల్లలూ.. మీరు ఎంతో ముచ్చటపడి కొనుక్కుని, రంగు రంగుల చేపలతో ముచ్చట్లాడుతుండే "అక్వేరియం"కు కూడా ఓ అందమైన కథ ఉంది తెలుసా..? కథ అంటే కథ కాదు, చరిత్ర. అక్వేరియాలకు 4వేల ఏళ్ల చరిత్ర ఉందటండ్రా. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలలోనే సుమేరియన్లు రంగు రంగుల చేపలను తెచ్చుకుని ఇళ్లముందు గొయ్యితవ్వి పెంచుకునేవారట. అయితే వాళ్లు మనలాగా చేపలతో ముచ్చట్లాడేందుకు కాదుగానీ, కావాల్సినప్పుడల్లా వండుకుని తినేందుకే వాటిని పెంచుకునేవారట.

ఇక ఈజిప్షియన్లు అయితే చేపలను దేవతలతో సమానంగా భావించేవారట. చేపల్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని పెంచుకునేవారట. ఇక చరిత్ర సంగతి కాసేపలా పక్కనపెడితే.. ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ కనిపించే అక్వేరియంలు తొలిసారిగా 17వ శతాబ్దంలో, ఇంగ్లండ్ దేశంలో తయారయ్యాయట.

" అక్వేరియం" అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1850వ సంవత్సరంలో లండన్‌కు చెందిన ఫిలిప్ గోస్ అనే ప్రకృతి శాస్త్రజ్ఞుడు ఉపయోగించాడట. జలచరాలపై పరిశోధనల కోసం పెద్ద పెద్ద గాజు గదులను తయారు చేయించిన ఆయన వాటికి అక్వేరియం అని నామకరణం చేశాడట. తరువాత 1853లో లండన్‌ ప్రజలు చూసేందుకు వీలుగా అతిపెద్ద అక్వేరియంను ఏర్పాటు చేశారట.

FILE
సంపన్న దేశం అమెరికాలో అత్యధికంగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో చేపలది రెండో స్థానం కావటం గమనార్హం. అక్కడ సుమారు 75 లక్షల ఇళ్లలో అక్వేరియంలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి పది ఇళ్లలో ఒక ఇంటికి అక్వేరియం ఉందన్నమాట. ఇక ఈ అక్వేరియంలలో పెంచుకునే చేపల్లో 20 కోట్లకు పైగా రకాలున్నాయిన్నాయంటే నోళ్ళెళ్లబెట్టేస్తాం కదూ.. అయినా అది నిజం.

తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. ప్రతి సంవత్సరం 3 కోట్ల సముద్ర జీవులు ఈ అక్వేరియంలలోకి చేరుతున్నాయట. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం అట్లాంటాలోని జార్జియాలో ఉంది. అందులో సుమారు 500 జాతులకు చెందిన లక్షకుపైగా జలచరాలున్నాయి. అన్నట్లు ఈ అక్వేరియంలో 81 లక్షల మిలియన్ గ్యాలన్ల నీటిని పోస్తారట పిల్లలూ..!

స్థూపం ఆకారంలో ఉండే అతిపెద్ద అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో కొలువై ఉంది. నిట్టనిలువుగా 82 అడుగుల ఎత్తు ఉండే ఈ అక్వేరియంలో 9 లక్షల గ్యాలన్ల ఉప్పునీరు, 56 జాతులకు చెందిన 2,500 రకాల చేపలను పెంచుతున్నారు. అక్వేరియాలలో పెంచే చేపలలోకెల్లా అతి ఖరీదైన చేప ఏదంటే "ప్లాటినం అరోవనా చేప". గరిష్టంగా 40 లక్షల రూపాయల విలువచేసే ఈ చేపలు దొరకటం చాలా అరుదు. ఇది ఎక్కువగా సింగపూర్‌లో దొరుకుతుంది. రంగు రంగుల చేపలతో అలరించే అందాల అక్వేరియం సమాచారం భలే గమ్మత్తుగా ఉంది కదూ పిల్లలూ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

Show comments