Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (17:43 IST)
గురుగ్రహదోష నివారణకు నవరత్నాల్లోని కనకపుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలనిస్తుందని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఆంగ్లంలో సైగటెరియస్ అని పిలువబడే ఈ పుష్యరాగాన్ని ధనుస్సురాశి జాతకులు ధరించాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావున, ధనుస్సురాశి జాతకులంతా.. దయాహృదయులుగా ఉంటారు. మృదువుగా సంభాషించడం, అధికారం చెలాయించడం వీరి నైజం.
 
ఈ రాశికి చెందిన జాతకులు కనకపుష్యరాగ రత్నాన్ని ధరించడం ద్వారా... బలము, నేత్రజ్యోతి పెరుగుతుందని రత్నాలశాస్త్రం పేర్కొంటుంది. వ్యాపారము, వ్యవసాయములలో వృద్ధి చెందడంతో పాటు, చదువు, అభ్యాసముల్లో ప్రగతి చెందుతారు. 
 
పుష్యరాగాన్ని ఎలా కనుగొనాలంటే...?
కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు ఉండవు. చూసేందుకు పారదర్శకంగానూ, కాంతివంతంగానూ ఉంటుంది. పుష్యరాగాన్ని చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది. అసలైన పుష్యరాగాన్ని ఎండలో ఉంచితే వెలుగు వ్యాపిస్తుంది.
 
ఎలా ధరించాలంటే...?
కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువారం సూర్యోదయ సమయంలో ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించుకుని ధరించడం మంచిది. ముందుగా పాలులో గానీ, గంగాజలములో గానీ శుద్ధిచేయాలి. పుష్యరాగాన్ని ధరించే ముందు 160 సార్లు గురుధ్యాన శ్లోకములు ధ్యానించడం మంచిది.

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

Show comments