Webdunia - Bharat's app for daily news and videos

Install App

3వ సంఖ్య వారి జాతక విశేషాలు

Webdunia
ఏ సంవత్సరమునైన, ఏ మాసంనందు అయిన 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు 3వ సంఖ్య వారుగా ఉందురు. ఈ 3వ సంఖ్య అధిపతి గురువు, పునర్వసు, విశాఖ పూర్వాచక్ర నక్షత్రములకు కూడా గురువు అధిపతి, త్రికాలములు, త్రిమూర్తులు కూడా ఈ మూడవ సంఖ్యకు సంబంధించినవారు. ఈ గురువుకి హృహస్పతి అనే పేరు వుంది. ఈ గురువు దేవతలకు గురువు. విద్యాకారకుడు. ధనకారకుడు అగుటవలన గురువును నవగ్రహములలో మంచి స్థానం ఇవ్వబడింది.

ఇందు జన్మించిన వారు ఎత్తుగాను, మంచి ఆకర్షణీయమైన కనులు గలవారు, పెద్దదైన నుదురు, చక్కని కనుపాపలు, త్వరితగతిన తెల్లబడు జుట్టు, అనగా చిన్న వయస్సునందు తెల్లబడు జుట్టు గలవారు, చక్కని శరీర ఛాయ గలవారు, ధృఢమైన శరీరము ఎదుటి వారిని ఆకర్షించే స్వరం, వీరి వర్ఛస్సు ఎదుటి వారిని ఆకర్ఛించేటట్లుగా ఉండగలదు.

వీరి ముఖంనందు వీరి మనోభావము ఎక్కువగా కానవస్తుంది. ఆర్థిక విషయంలో చాలా ఆశగలవారు అయినా ధనం మాత్రం అధికంగా ఖర్చులు చేయువారుగా ఉందురు. అందరియందు ప్రేమ, అనురాగం, గలవారు, సరదాగా ఉండువారు, మంచి సలహా, సహాయం అందించువారు, వీరికి మంచి స్నేహబృందాలు అధికంగా ఉండగలవు. ప్రతి విషయాన్నీ అధికంగా ఆలోచించి తరచి చూసే స్వభావం, సలహాలు ఇచ్చుటలో సిద్దహస్తులు అనే చెప్పాలి. ప్రతి విషయంలో ఎదుటివారికి అర్థం అగునట్లు విశదీకరించి తెలుపు స్వభావము గలవారు, విద్యా వృత్తులలో వీరికి ప్రత్యేకస్థానం ఉండగలదనే చెప్పాలి. ఉద్యోగ రంగంలో ఒక్కర్ని ఆశ్రయించి ఉండడం, స్వతంత్ర జీవనం గడుపుటకు వీరికి అధికమైన ఇష్టం. రాజకీయాలలో సంఘంలో వీరు మంచి పేరు, ఖ్యాతి పొందగలరు. ఎవరయినా ఎవరయినా వీరి సలహా పొందినచో చాలా అభివృద్ధికి ఆస్కారం వుండగలదు.

వీరికి నీతి, నియమాలు అధికంగా ఉండగలదు. భక్తి శ్రద్దలు కూడా అధికం. వీరు అంతగా శ్రమ పడటం వుండదనే చెప్పాలి. వీరు శ్రమ పబడిన వెంటనే మరిచిపోవు స్వభావము గలవారుగా వుందురు. ప్రతి సమస్యను తెలివిగా ఎదుర్కొనే స్వభావము వీరికి ఉండగలదు. ధర్మ కార్యక్రమములయందు, దైవ, ఆధ్యాత్మిక చింతనపట్ల అధికమైన మక్కువ ఉండగలదు. వీరు దేవాలయములకు ట్రస్టులుగా ఉండగలరు. మధ్యవర్తిత్వం, సంగీత, సాహిత్య సత్యార్యములయందు అధికమైన ఇష్టం గలవారుగా ఉందురు. ప్రసంగాలపై వీరికి మక్కువ ఎక్కువ, వీరిలో ఎక్కువ భాగం రచనా రంగంలో వారుగా ఉందురు. వీరికి మాట పట్టుదల అధికంగా ఉండగలదు. ఏదైనా చెప్పిన ఎదుటివారు విన్నారా? లేదా? అనే అనుమానం అధికంగా ఉండగలదు. అందవలన వీరు చెప్పిందే చెప్పడం జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments