Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహరాశి జాతకులారా..! మాణిక్యం ధరించండి.

Webdunia
సింహరాశిలో పుట్టిన జాతకులు నవరత్నాల్లో మాణిక్యాన్ని ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. మాణిక్యం ఎరుపు రంగును కలిగి ఉంటుంది. దీనిని ఆంగ్లంలో రూబీ అంటారు. రవిరత్నము, పద్మరాగ్ అనే పేరు కలిగిన మాణిక్య రత్నాన్ని సింహరాశి జాతకులు ధరించడం ద్వారా సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి.

అంతేకాకుండా కెంపు రత్నముతో చేసిన హారము, చెవుపోగులను ఈ రాశిలో జన్మించిన మహిళలు ధరిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారు. వీటిని ధరించడం ద్వారా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు సకాలంలో చేతికి అందుతాయి. ఇంతవరకు అనారోగ్యబారిన పడిన బంధువుల ఆరోగ్యం కుదుటపడుతుంది.

సింహరాశికి సూర్యుడు అధిపతి. అందుచేత ఈ జాతకులు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. సంచార జీవులుగానూ, ఆత్మాభిమానం కలిగిన వారుగానూ ఉంటారు.

మాణిక్యాన్ని ఎలా ధరించాలంటే... ఆదివారం సూర్యోదయానికి మాణిక్యాన్ని ధరించాలి. కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేరువవుతాయి. వెండిలోహముతో మాణిక్యాన్ని పొదిగించి ధరించడం మంచిది. ముందుగా పాలులోగానీ, గంగాజలములో గానీ మాణిక్యాన్ని శుద్ధిచేయాలి. మాణిక్యాన్ని ధరించే సమయంలో రవి ధ్యాన శ్లోకమును 60 సార్లు ధ్యానించి ధరిస్తే సకల సంపదలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

మాణిక్యం ఎలా ఉంటుందంటే...?
అసలైన మాణిక్యం ప్రకాశవంతమైన మెరుపును కలిగి ఉంటుంది. ఇది లక్ష రంగులను కలిగి ఉండి, కాంతివంతంగా ఉదయం పూట సూర్యకాంతితో ఉంచితే దానిలోకి కిరణాలు వెలువడుతాయి. అంతేగాకుండా నిజమైన మాణిక్యాన్ని అరచేతిలో ఉంచితే కొద్దిగా వేడిగా ఉంటుందని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments