Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ జీవితం - ఆర్థిక విషయములు

Webdunia
వీరికి వివాహ జీవితం చాలా శుభప్రదంగా ఉండగలదు. వీరికి ప్రేమ వ్యవహారాలు ఫలించవు. వీరి జీవిత భాగస్వామిగా లభించువారు. సదాచార సంపన్నులు, సత్త్ ప్రవర్తన గలవారు. వీరు అనగా 3వ సంఖ్యవారు 2, 6, 8, 9 సంఖ్యలు వారిని వివాహమాడిన ఉత్తమము. వీరికి మగ సంతానం అధికంగా ఉండగలదు. కుటుంబంలో ఈ సంఖ్యవారి జీవితం చాలా సుఖదాయకంగాఉండగలదు.

ఆర్థికంగా వీరు చాలా మంచి స్థితి, అభివృద్ధికి ఆస్కారం గలదు. అయితే వీరు యెంత సంపాదించిన ఊహించని ఖర్చులు చేయువారుగా ఉందురు. అయితే ఖర్చులు కూడా సద్వినియోగం అవగలవు. విద్యాలయములకు గానీ, దేవాలయములకు గానీ, ధనం బాగుగా వెచ్చించుదురు. లేనిచో పేద విద్యార్థులకు ధన సహాయం చేయువారుగా ఉందురు.

ఆర్థికంగా వీరికి ధనం లేదు అనే సమస్య ఉండదు. ధనం బాగుగా చలామణి వీరివద్ద అవగలదు. వీరు పదిమందికి ధన సహాయం చేసి సంఘంలో మంచి పేరు ఖ్యాతి పొందగలవారు. వీరిలో చాలా మంది రచనా రంగంలో, కళాకారులు, మంచి శాస్త్రవేత్తలు, మంచి ఉపన్యాసకులుగా ఉందురు. వీరి ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్త అవసరం. వీరికి నరములు, కీళ్ళు, జీర్ణకోశవ్యాధులు సంబంధించిన అనారోగ్యం అధికంగా రాగలదు. వీరికి ఆరోగ్య విషయమునందు అధికమయిన భయం ఉండగలదు. వీరు ఆహారాది విషయంలో నియమం పాటించటం చాలా ముఖ్యం.

వీరికి చాలా మంది రచనా రంగంలో, కళాకారులు, మంచి శాస్త్రవేత్తలు, మంచి ఉపన్యాసకులుగా ఉందురు. వీరి ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్త అవసరం. వీరికి నరములు, కీళ్ళు, జీర్ణకోశవ్యాధులు సంబంధించిన అనారోగ్యం అధికంగా రాగలదు. వీరికి ఆరోగ్య విషయమునందు అధికమయిన భయం ఉండగలదు. వీరు ఆహారాది విషయంలో నియమం పాటించటం చాలా ముఖ్యం. వీరికి అప్పుడప్పుడు బాల్య సంబంధించిన అనారోగ్యం కూడా రాగలదు.

వీరు కనకపులోహంగానీ, రాగిలోహంగానీ ధరించిన శుభం. పసుపు, తెలుపు, వర్ణములు గల దుస్తులు ధరించిన శుభం కల్గును. వీరికి ఈశాన్య దిక్కు చాలా మంచిది. బంగారంతో గానీ, పంచలోహములతో చేసిన వస్తువులు ధరించిన శుభం కలుగుతుంది. వీరికి 11, 16, 22, 31, 25, 2, 8 తేదీలు బాగుగా కలిసివస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 3, 8, 9 వీరికి ఆది, సోమ, గురువారాలు బాగుగా కలిసివస్తుంది. వీరు చీట్ల పారాయణం చేసినా శుభం.

ఇందు జన్మించిన వారు ఔరంగజేబు, అబ్రహంలింకన్, జగదీష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, బాబు రాజేంద్రప్రసాద్, ఆల్‌ఫ్రైడ్‌నోబెల్, సదానంద భారతి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు, సముద్రాల రాఘవాచారి, వీరు కాక అనేక మంది ప్రముఖులు ఇందు జన్మించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments