Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో నెంబరు వారి వివాహ జీవతం- ఆర్థిక విషయాలు

Webdunia
వీరి వివాహ జీవితం చాలా ఆనందదాయకంగా ఉండగలదు. వీరు ప్రేమించి వివాహం చేసుకొన్న సుఖప్రధంగా ఉండగలదు. వీరి చర్య మంచి సంస్కారం కలవారు. ఉన్నత విద్యగలవారై వుందురు. వీరు 1వ సంఖ్యవారిని ప్రేమించిన శుభం. వీరికి 3, 5, 8 సంఖ్య వారిని వివాహం చేసుకున్న చాలా బాగుగా ఉండగలదు. 25 సంవత్సరములలోపు వివాహం చేసుకున్న చాలా బాగుగా ఉండగలదు. 25 సంవత్సరములలోపు వివహం చేసుకొన్న వారి జీవితం చాలా సామాన్యముగా వుండగలదు. వీరికి ఎక్కువగా 25-30 సంవత్సరముల మధ్య వివాహం జరుగును. వారికి మంచి యోగప్రదులైన సంతానం జన్మించగలదు. వీరి వీరి వివాహ జీవితం ఒక్కొక్కసారి పాడు చేసుకొందురు. అందువలన వీరు చాలా పరీక్షించి వివాహం చేసుకున్నచో శుభదాయకంగా వుండగలదు.

వీరికి జీవితంలో వస్తు, వాహన, గృహాదులు బాగుగా ఉండగలదు. అయితే వీరి పేరుకు తగిన సంపాదన కూడా చాలదు. ఆర్థికంగా వీరికి వివాహ అనంతరము చాలా శుభదాయకంగా ఉండగలదు. వీరికి 30 సంవత్సరముల ఆర్థికంగా స్థిరపడగలరు. వీరికి వస్తువులు గృహ నిర్మాణం, అతిశుభ్రత అధికంగా ఉండగలదు. వీరికి కళత్రమునకు అంత శుభ్రము వుండజాలదు అనే చెప్పవచ్చు. వీరికి ఏ వస్తువు ఎక్కడ పెట్టింది అక్కడ వుండాలి అనే అభిప్రాయం వుడగలదు. వీరికి కొంత మతిమరుపు కూడా ఉండగలదు.

వ్యాపార, రచనా రంగాలలో వీరు నెమ్మదిగా కష్టించి పైకి రాగలరు. రాజకీయ నాయకులు ఊహించకుండా అభివృద్ధి పొందగలరు. వీరు ఎవరితోను ఏకీభవించకపోవడం వలన ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి దెబ్బ తినడానికి ఆస్కారం గలదు. వీరు చాలా ప్రఖ్యాతి గాంచగలరు. కళారంగంలో వీరు సామాన్యముగా వుండగలరు. వీరు ఫ్యాక్టరీస్ స్థాపించిన పత్రికారంగంలో వారు మాత్రం మంచి స్థాయికి చేరుకోగలరు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఉన్నత పదవులు అలంకరిస్తాయి. సేవకా వృత్తులలో వీరు స్థిరమైన జీవితం గడపగలుగుతారు. వీరికి ఎక్కువగా ఇతర దేశములకు వెళ్ళుటకు ఆస్కారం ఉండగలదు. అయితే వీరు 40 సంవత్సరం నుంచి వీరి కోర్కెలు నెరవేరగలవు.

2 వ సంఖ్య పురుషులు, స్త్రీలు బాగుగా పధకాలు వేసి జయం పొందగలరు. వీరికి ఆత్మవిశ్వాసం అధికం. వీరికి ఆర్థికంగా మంచి స్థితి పొందగలరు. వీరి సంతానం కోసం తగిన సంతృప్తి పడగలరు. అందువలన వీరు అధిక జాగ్రత్త అవసరం. నరముల సంబంధించిన అనారోగ్యం అధికంగా రాగలవు. హృదయానికి సంబంధించిన అనారోగ్యం, మనోవ్యాధులు అధికంగా రాగలవు. వీరు జాతిముత్యం గానీ, చంద్రకాంత మణిగానీ ధరించిన శుభం. ఆభరణములలో వెండి ధరించిన మంచిది. వీరికి ఉత్తరముఖం గల ఇల్లు, వ్యాపార సంస్థగానీ చాలా కలసి రాగలదు. వీరికి 2, 7, 22, 16 తేదీలు సోమవారం వచ్చిన ఇంకా బాగుగా కలిసి రాగలదు ఇందు ముఖ్యమైన పనులు చేపట్టిన జయం పొందగలరు. వీరు శివునికి సంబంధించిన పూజలు చేసిన జయం కలుగుతుంది.

ఇందు అనేక మంది ప్రఖ్యాతి గాంచిన వారు జన్మించినవారు. మహాత్మాగాంధీ, నరసింహభారతి, రమణమహర్షి, స్వామి విద్యారణ్య, ముస్సోలినీ, సత్యజిత్‌రే, మహ్మద్, రాజివ్‌గాంధీ, మురార్జీదేశాయ్ వంటి ప్రముఖులు గాక ఇంకా ప్రఖ్యాతి గాంచిన వారు కూడా ఇందు జన్మించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Show comments