Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు తులారాశి జాతకులా...? వజ్రాన్ని ధరించండి

Webdunia
శాంత స్వభావం కలిగిన తులారాశి జాతకులు నవరత్నాలలో మేలిమిదైన వజ్రాన్ని ధరించడం శ్రేయస్కరమని రత్నాలశాస్త్రం చెబుతోంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ జాతకులు వాక్చాతుర్యత, ఆలోచనపరులుగా ఉంటారు.

ఇంగ్లీష్‌లో డైమండ్ అని పిలువబడే ఈ వజ్ర రత్నాన్ని... తులారాశికి చెందిన జాతకులు ధరిస్తే శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయని రత్నాలశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా తెలుపు రంగులో ఉండే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా ధనధాన్యములు సమృద్ధిగా లభిస్తాయి.

స్త్రీ, పురుషులు వజ్రాన్ని బంగారంతో పొదిగించి ధరిస్తే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. వజ్రరత్నంతో ఆడవాళ్లు నెక్లెస్, చెవిపోగులు చేయించుకుని ధరిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని రత్నాల శాస్త్రం చెబుతోంది.

ఎలా ధరించాలంటే..?
శుక్రవారం సూర్యోదయానికి ముందే ధరించడం ద్వారా శరీరబలం, ఆరోగ్యం చేకూరుతోంది. బంగారంతో మాత్రమే పొదిగించిన వజ్రరత్నాన్ని కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది. ముందుగా పాలు లేదా గంగాజలముతో వజ్రాన్ని శుద్ధి చేయాలి. తర్వాత శుక్ర ధ్యాన శ్లోకమును 200 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వజ్రాన్ని ఇలా కనుగొనవచ్చు...
అసలైన వజ్రం స్థిరముగా, కఠినంగా ఉంటుంది. నిజమైన వజ్రంపై చారలు ఉండవు. వజ్రాన్ని ఎండలో పెడితే ఇంద్రధనుస్సు కనబడుతుంది. అదేవిధంగా అసలైన వజ్రం కింద పడితే పగిలిపోతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే'.. కొడుకు క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి... ఎక్కడ?

వైద్య విద్యార్థిని గుండె కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

బై నాన్నా... మీరు ఒక ఫైటర్ నాన్నా.. తండ్రి గురించి హీరో భావోద్వేగ పోస్ట్

చిన్నాన్న భౌతికకాయంతో స్వగ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్... నేడు అంత్యక్రియలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... రూ.300 కోట్ల ఆస్తి నష్టం

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments