Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీనరాశిలో పుట్టారా? ఐతే కనకపుష్యరాగం ధరించండి

Webdunia
FILE
మీనరాశిలో పుట్టిన జాతకులు కనకపుష్యరాగం ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనకపుష్యరాగం ధరించడం ద్వారా గురుగ్రహదోషాలు తొలగిపోతాయి. బలము, నూతనోత్సాహం, నేత్రజ్యోతి పెరుగుతుంది. టోపాజ్ అని పిలువబడే పుష్యరాగ రత్నాన్ని ధరించే మీనరాశి జాతకులకు ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. దయాహృదయులు, ధైర్యవంతులు, కష్టజీవులుగా ఉండే మీనరాశి జాతకులు పుష్యరాగం ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

కనకపుష్యరాగం ఎలా ఉంటుందంటే..?
పసుపు రంగును కలిగి ఉండే కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు వుండవు. పుష్యరాగంలో కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం అనే రెండు రకాలు కలవు. పుష్యరాగము ఎలా ఉంటుందంటే..? పారదర్శకము మరియు కాంతివంతముగా వుంటుంది. అసలైన కనకపుష్యరాగమును ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది. పుష్యరాగమును చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది.

ఎలా ధరించాలంటే..?
గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారపు లోహములో పొదిగించి, కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలులోగానీ, గంగాజలములో గానీ శుద్ధి చేయాలి. గురు ధ్యాన శ్లోకములు 160 మార్లు ధ్యానించి ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సకల సంపదలు చేకూరుతాయని రత్నాల శాస్త్రం చెబుతోంది.

ఇకపోతే.. మీనరాశిలో జన్మించిన జాతకులకు మూడు, ఏడు మరియు 12, 21, 30, 48, 57, 66, 75, 7, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు కలిసొస్తాయి. వీటితో పాటు 1, 2, 9 అనే సంఖ్యలు కూడా సామాన్య ఫలితాలను ఇస్తాయి. అయితే 5, 6 అనే సంఖ్యలు మాత్రం కలిసిరావని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే మీనరాశి జాతకులకు ఎరుపు, పసుపు వంటివి అనుకూలిస్తాయి. ఈ రంగుల్లో దుస్తులు ధరించడం ద్వారా మనశ్శాంతి నెలకొంటుంది. ఇందులో పసుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.

మరోవైపు.. మీనరాశి జాతకులకు గురువారం శుభ ఫలితాలనిస్తుంది. గురువారం ప్రారంభించే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే ఆది, సోమవారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. కానీ బుధవారం మాత్రం ఈ రాశి జాతకులకు అంతగా కలిసిరావు. అలాగే మంగళవారంలో చేబదుళ్ళు తీసుకోవడం, ఇవ్వడం కూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments