Webdunia - Bharat's app for daily news and videos

Install App

మఖ నాలుగోపాదం : జన్మకారుల రత్నధారణ...!

Webdunia
మంగళవారం, 14 అక్టోబరు 2008 (20:07 IST)
మఖ నక్షత్రం నాలుగోపాదంలో జన్మించిన వారికి రెండు సంవత్సరాల వయస్సు వరకు కేతుమహర్దశ సంచారం కావడంతో.... వైఢూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్న శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

రెండు ఏళ్ళ వయస్సు నుంచి 22 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు వరకు రవిమహర్దశ ప్రవేశిస్తుండడంతో... కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

28 ఏళ్ళ నుంచి 38 సంవత్సరాల వయస్సు వరకు చంద్రమహర్దశ సంచరిస్తుండడంతో... ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

38 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు వరకు కుజమహర్దశ కావడంతో... పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

45 ఏళ్ళ వయస్సు నుంచి 63 సంవత్సరాల వయస్సు వరకు రాహుమహర్దశ సంచరిస్తుండటంతో గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

63 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు గురుమహర్దశ కావడంతో..కనకపుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments