Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగడమును ఎలా ధరించాలి!?

Webdunia
గురువారం, 31 మే 2012 (18:13 IST)
FILE
పగడమును కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంగళవారం, మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాల రోజున ప్రాతఃకాలము నుంచి 11 గంటల లోపు ధరించాలి. "ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని ఏడువేల సార్లు పఠించి తర్వాత ధరించాలి. పగడమును బంగారంలోను, వెండిలోనూ పొదిగించుకుని ధరించవచ్చు. భూత, ప్రేత బాధలు తొలగించడానికి పగడ ధారణ చేయవచ్చు. ఇంకా వ్యాపారాభివృద్ధికి పగడమును ధరించవచ్చును.

శివాలయంలోని నవగ్రహముల మండపములోని కుజుని విగ్రహము వద్ద ఉంగరము వుంచి కుజుని అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీలు కందులు ఎర్రని వస్త్రములో దానం చేయించగలరు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయించాలి.

బ్రాహ్మణుడితో ఏడు వేల సార్లు కుజుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయాలి. సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు. కనీసం ధరించే వ్యక్తి కుజ ధ్యాన శ్లోకము 70 సార్లు పారాయణ చేసి ధరించగలరు.

ధరించాల్సిన సమయం: మంగళవారం, మృగశిర, చిత్త, ధనిష్ఠ, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్ఠి.
దానం చేయవలసినవి: ప్రమిదెలు, ఎర్రనిపూలు, ఎర్రచందనం, ఎర్రవస్త్రములు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం, విశిష్టత ఏమిటి?

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

Show comments