Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్న ఉంగరాలు ధరించటం వల్ల తొలగే లాభనష్టాలు

Webdunia
శనివారం, 9 జూన్ 2007 (15:55 IST)
భూమిపై పుట్టే మానవులు గ్రహాలు తారా బలముల చేత సుఖ దుఃఖాలను పొందుతూ జీవిత కాలాన్ని వెళ్లదీస్తారు. ముఖ్యంగా ప్రతి మనిషి సుఖాన్ని పొందాలని వివిధ రకాలు పూజలు పునస్కారాలు, దైవారాధనలు చేసి, మొక్కుల తీర్చుకుంటుంటాడు. అలాగే.. తమ అదృష్టం మరింత పెంచుకునేందుకు నవరత్న ఉంగరాలను, వజ్ర వైఢూర్యాలను హారాలుగా చేసుకుని ధరిస్తుంటాడు.

అయితే నవరత్న ఉంగరాలను ధరించే వారు అధికంగా ఉన్నారు. ఈ నవరత్న ఉంగరాలను ఎలాంటి వ్యక్తులు ధరించాలో తెలుసుకుందాం. వజ్రపుటుంగరాన్ని రాజకీయవేత్తలు, ఆకర్ణణ లోపమువారు, స్త్రీలోలురు ధరించాలి. అలాకే.. చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు వజ్రమును గాని పగడమును గానీ ధరించినట్టయితే వ్యాధి కొంత మేరకు నయం అవుతుందని నవగ్రహ వైభవం చెపుతోంది.

నీలం రాయి కలిగిన ఉంగరాన్ని అతి దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.

పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిదని జ్యోతిష్కులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments