Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్నాల ఫలితం - సమస్త దోషాలు మాయం

నవరత్నాల దోషాలు గ్రహాలు వేడి... కాంతి

WD
ఆదివారం, 3 జూన్ 2007 (18:11 IST)
గ్రహాలు సకల జీవకోటిపై ఇచ్చే ఫలితాలు కాంతి రూపంలో ఉంటాయి. శారీరక మానసిక తరంగాలైన వేడి... కాంతికి చెందిన ప్రకంపనాలు, సౌర కిరణాల ప్రభావం వల్ల ఆయా జీవరాశులు బలం పొందుతున్నాయి. ఇదే కోవలో మానవులు కూడా ఉన్నారు. గ్రహ కిరణాల ప్రభావం ప్రతి క్షణానికి మారుతుంటాయి. దానికి అనుగుణంగా మానవులుపై ప్రభావం పడుతుంటుంది. వాటి ఫలితాలు మనకు తెలిసే విధంగానే ఉంటాయంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. ఇవే మానసికంగా శారీరకంగా అనేక రుగ్మతలు కలుగజేస్తున్నాయి. వీటన్నిటినీ అధిగమించటానికి నవరత్న ధారణ ఒక్కటే మార్గమని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

రత్నాలు ధరించటం వల్ల గ్రహాల నుంచి వెలువడే చెడు కాంతి కిరణాలను నిలువరించి దుష్ఫలితాలు తగ్గిస్తాయి. దీనికి సంబంధించినవే వర్ణచికిత్స సంబంధించిన చికిత్సలు. రోగాలు, అనేక వ్యాధుల నివారణకు సంబంధిత రత్నాలను ధరించటం వల్ల వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు నేర కాంక్షను తగ్గించగల గుణం కూడా ఈ రత్నాల కు ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే ప్రతి గ్రహానికి నక్ష త్రానికి ఒక్కో రంగు చెప్పబడింది. ఈ రంగులను ఆధారం చేసుకుని నవరత్నాలను ధరించాలి.

చంద్ర గ్రహ ప్రభావంతో వచ్చే వ్యాధులు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలకు ముత్యాన్ని ఆభరణంగాగాని లేదంటే ఉంగరంగాగాని ధరించాలి. ఉంగరం అయినటై్లతే వెండితో చేయించుకోవటం మంచిది. కుజ గ్రహం కలుగజేసే ఇబ్బందులకు పగడం పొదిగిన ఆభరణం లేదంటే ఉంగరాన్ని ఆవు నేతితోనూ, తేనెతోనూ శుద్ధి చేసి ధరించాలి. ఈ గోమేధికానికి మారుగా ఇతర రాళ్లను కూడా ధరించవచ్చు. అయితే ఇది జ్యోతిష శాస్త్రంలో నిపుణులైన వారి సలహా మేరకు ధరించాలి.

రాహువు ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు అనారోగ్య సమస్యలకు గోమేధికం పొదిగిన ఆభరణం లేదంటే ఉంగరాన్ని పాలతో శుద్ధి చేసి ధరిస్తే ఆరోగ్యం కుదుటపడటమే కాక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. బుధ గ్రహం ప్రభావం వల్ల కలిగే సమస్యలకు పచ్చను ఆభరణంగాగానీ లేదంటే ఉంగరంగా గానీ చేయించుకోవాలి. శుక్ర గ్రహానికి సంబంధించి దోషాలను నిరోధించటానికి వజ్రాన్ని ధరించాలి. శని గ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు, కష్ట నష్టాలకు నీలమణిని ఆభర ణంలో కానీ లేదంటే ఉంగరంగా గానీ ధరించవచ్చు.

గురు గ్రహం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఇతర కష్ట నష్టాలను ఎదుర్కొనేందుకు పుష్య రాగం పొదిగిన ఆభరణాన్ని లేదంటే ఉంగరాన్ని ధరించాలి. దీనిని కొనలేని వారికి ప్రత్యామ్నాయం లభ్యమవుతున్నాయి. అలాగే చివరి గ్రహమైన కేతువు కలిగించే దోష నివారణకు వైఢూర్యం ధరించాలి. అయితే వీటన్నిటినీ ధరించటానికి ముందు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. లేదంటే అది దోష నివారణకు ఎంతమాత్రం పని చేయకపోగా చెడును తెస్తాయి.నవరత్నాలతో సమస్త దోషాలు మాయం
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

Show comments