Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్నాలు పొదిగిన ఉంగరాలు : వాటి మేలు

Webdunia
గురువారం, 12 జులై 2007 (18:34 IST)
పలు సమస్యల నివారణకు చాలా మంది నవరత్నాలతో ఉంగరాలు చేయించుకొని ధరిస్తూండటం మనం చూస్తుంటాం. నవరత్నాలంటే ఏవేవి ? ఏ ఏ అంశాలపై అవి ప్రభావం చూపుతుంటాయి ? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆయా ప్రయోజనాలపై మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ రత్నాలు, అవి చేసే మేలు గురించి తెలుసుకుందాం.

నవరత్నాలంటే కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైఢుర్యాలు.

కెంపు :
మానసిక సమస్యలు, హృద్రోగం, కంటి వ్యాధులతో బాధపడేవారు, అధిక వ్యయం పేదరికంతో ఇక్కట్ల పాలవుతున్నవారు ఎరుపు రంగు కెంపు రత్నంతో ఉంగరం చేయించుకొని ఆదివారం రోజు ఉదయం పూట ధరించాలి.

ముత్యం:
వివాహ వాంఛితులు, కళల్లో పురోగతి కోరేవారు, కుటుంబ సౌఖ్యాన్ని ఆశిస్తున్నవారు ముత్యం పొదిగిన ఉంగరాన్ని సోమవారంనాడు ధరించాలి.

పగడం:
శతృపీడ నివారణ, రాజకీయాలు, వాణిజ్య రంగాల్లో పురోగతి, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం కోసం పగడపు ఉంగరాన్ని ధరించాలి.

పచ్చ:
స్థిర చిత్తం, విద్యలో అభివృద్ధి, వ్యాపార పురోభివృద్ధి, నరాల వ్యాధి నుంచి విముక్తికి బుధవారం రోజున పచ్చ రాయి ఉంగరాన్ని పెట్టుకోవాలి.

పుష్యరాగం:
ఆథ్యాత్మిక వికాసం, సూక్ష్మ జ్ఞానం కోసం పుష్యరాగ ఉంగరం ధరించాలి. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారికీ ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.

వజ్రం:
సంగీత కళలు, మంత్ర శాస్త్రంపై ఆసక్తి గలవారు వజ్రపుటుంగరాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. పాలనాపరమైన వ్యూహరచనలు చేసేవారు, ఇతరులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించేవారికీ వజ్రం ఉపకరిస్తుంది.

నీలం:
దారిద్ర్య బాధతో సతమతమవుతున్న వారు నీల రత్నం గల ఉంగరాన్ని ధరించాలి. కీళ్లకు సంబంధించిన సమస్యలున్నవారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.

గోమేధికం:
చిత్త చాంచల్యం నుంచి బయటపడేందుకు, వ్యాపారాల్లో లాభార్జనకు, శత్రువులను జయించేందుకు గోమేధికం పొదిగిన ఉంగరాన్ని ధరించాలి.

వైఢుర్యం:
సంతాన లోపాన్ని అధిగమించేందుకు, విష జంతు బాధ నుంచి విముక్తి పొందేందుకు, కార్య సాఫల్యం కోసం వైఢూర్యం గల ఉంగరాన్ని పెట్టుకోవాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

Show comments